ఈతలో అఆలు నేర్పిస్తున్న ఏఏ

Update: 2017-04-03 11:30 GMT
టాలీవుడ్ ప్రేక్షకులకు ఏఏ అంటే ఎవరో చెప్పాల్సిన ప్రత్యేకంగా లేదు. ఈ రెండక్షరాలు అల్లు అర్జున్ కు మారుపేరుగా మారిపోయి చాలాకాలమే అయింది. అటు సినిమాలు మాత్రమే కాదు.. ఇటు ఫ్యామిలీ పర్సన్ గా కూడా బన్నీ సూపర్ అనాల్సిందే. ముఖ్యంగా ఫ్యామిలీ ఫోటోస్ ను మెమరబుల్ గా మార్చేసి.. ఆ పిక్ చూసినవాళ్లకు జీవితాంతం గుర్తుండిపోయేలా భలే ఫోటోలను అందిస్తుంటాడు.

ముఖ్యంగా అల్లు అర్జున్ కి కొడుకు పుట్టకముందు నుంచి మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికీ కంటిన్యూ అయిపోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన కుటుంబంతో గోవాలో సూపర్బ్ గా ఎంజాయ్ చేసేస్తున్నాడు. పుట్టిన రోజు వేడుకల కోసం తెగ ఎదురుచూసేస్తున్నాడు. ఏప్రిల్ 8న వచ్చే తన బర్త్ డే కోసం కాదండోయ్. దానికి నాలుగు రోజుల ముందు ఏప్రిల్ 5న వచ్చే తన కొడుకు అల్లు అయాన్ పుట్టిన రోజు కోసం వెయిట్ చేస్తున్నాడు. కొడుకుతో కలిసి టైం గడుపుతున్నాడు.

పనిలో పనిగా తనకు వచ్చిన విద్యలను కూడా నేర్పించేస్తున్నాడు బన్నీ. తను స్విమ్మింగ్ చేస్తూ.. కొడుకు అయాన్ ను భుజాలపై మోస్తూ.. స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్పిస్తున్న ఫోటో సూపర్బ్ గా ఉంది. ఇలాంటి మెమరీస్ చాలామందికి ఉంటాయ్ కానీ.. వాటిని ఇంత అందంగా అందరితో పంచుకోవడం.. అందరికీ చేతకాదు. దట్స్ ఓన్లీ ఫర్ ఏఏ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News