డీజేకి మళ్లీ బ్రేక్ ఇచ్చిన అల్లు అర్జున్

Update: 2017-01-13 05:13 GMT
టాలీవుడ్ లో టాప్ ఫాంలో ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ పేరును మొదటగా చెప్పుకోవాలి. కొన్నేళ్లుగా వరుసగా హిట్స్ సాధిస్తూ.. అన్ని సినిమాలను 50 కోట్ల షేర్ మార్క్ దాటిస్తున్న హీరో స్టైలిష్ స్టార్ ఒక్కడే. ప్రస్తుతం డీజే-దువ్వాడ జగన్నాధం చిత్రంలో నటిస్తున్నాడు అల్లు వారబ్బాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ డ్యుయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఉంది.

డీజే మూవీ వర్క్ వేగంగానే సాగుతోంది కానీ.. అల్లు అర్జున్ కి సంబంధించిన పోర్షన్ షూటింగ్ మాత్రం పార్టుపార్టులుగా తీయాల్సి వస్తోంది. తాజాగా తనకు ఓ చిన్నారి పుట్టిన సందర్భంగా ఓ నెల్లాళ్లు బ్రేక్ ఇచ్చిన బన్నీ.. ఆ తర్వాత న్యూఇయర్ కి ఓ బ్రేక్ ఇచ్చాడు. ఇఫ్పుడు మళ్లీ మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150.. పొంగల్ పండుగ సందర్భంగా మూడు రోజుల బ్రేక్ తీసుకున్నా.. దాన్ని ఇంకొన్ని రోజులు కొనసాగిస్తున్నాడట.

ఇందుకు కారణం ఏంటంటే.. కొన్ని వారాల క్రితం అల్లు అరవింద్ సోదరి మరణించారు. తాజాగా అల్లు అరవింద్ కూడా అందుకే తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోలేదట. ఈ కారణంగానే డీజే షూటింగ్ కు తాను కొన్నాళ్లు అందుబాటులో ఉండలేనని సమాచారం ఇచ్చాడట బన్నీ. అయితే.. షూటింగ్ కి బ్రేక్ పడ్డా.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేశామంటూ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News