బన్నీ నెల రోజుల బ్రేక్ ఇచ్చేశాడంతే

Update: 2016-11-24 13:30 GMT
సరైనోడు సినిమాతో సరైన హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ఆ మూవీ రిలీజ్ తర్వాత దాదాపు ఆరు నెలలు బ్రేక్ తీసుకుని మరీ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే-దువ్వాడ జగన్నాధంను లేట్ గా స్టార్ట్ చేసినా.. ఫాస్ట్ గా ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకోవడం విశేషం.

ఇప్పటికే డీజేకి 2 షెడ్యూల్స్ ఫినిష్ అయిపోయాయి కూడా. అసలు బన్నీ ఇంకా షూటింగ్ లో జాయిన్ కాక ముందే 10 రోజుల పాటు ఇతర నటులతో మొదటి షెడ్యూల్ షూట్ చేసేశాడు హరీష్ శంకర్. ఆ తర్వాత కొత్త గెటప్ లో ఉన్న బన్నీతోను.. హీరోయిన్ పూజా హెగ్డే కాంబినేషన్ లోను పలు సన్నివేశాలను రెండో షెడ్యూల్ లో చిత్రీకరించారు. ఇప్పుడు సడెన్ గా బ్రేక్ ఇచ్చేశాడు అల్లు అర్జున్. ఏకంగా నెల రోజుల పాటు బ్రేక్ అని చెప్పేశాడట. కావాలంటే తన కాంబినేషన్ లేని సీన్ లను  తీసుకోమని కూడా చెప్పేశాడట. ఇందుకు కారణం.. రీసెంట్ గా అల్లు అర్జున్ భార్య.. ఓ ఆడబిడ్డకు జన్మనివ్వడమే.

సాధారణ ప్రసవ సమయం కంటే ముదే జన్మనివ్వడంతో.. భార్యా కూతురు దగ్గరే ఉండాలని డిసైడ్ అయిన బన్నీ.. కంప్లీట్ నెల రోజులు సెలవు ఇచ్చేశాడట. అయితే.. షూటింగులు శరవేగంగా పూర్తి చేసే హరీష్ శంకర్.. హీరో లేని సన్నివేశాలను తీసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News