తగ్గేదే లే ఒకలా..గోవిందుడు అందరివాడేలే ఇంకోలా! అంటూ ఇంతకుముందు రామ్ చరణ్ ఉన్న వేదికపై బన్ని ఎంతో స్టైలిష్ గా సన్నివేశానికి తగ్గట్టే స్పీచ్ ఇచ్చారు. వైవిధ్యభరితమైన వాయిస్ మాడ్యులేషన్ తో డైలాగ్ లు చెప్పారు. అలా పంచీగా విసరడం అందరికి సాధ్యం కాని గొప్ప కళ.. అందుకే అతడు ఐకనిక్ మాస్ స్టార్ అనిపించారు.
ఇప్పుడు మరోసారి తగ్గేదే లే..! అంటూ విరుపుతో కూడుకున్న డైలాగ్ తో హాట్ టాపిక్ అయ్యాడు బన్ని. ``వెళ్లే ముందు పుష్ప గురించి ఒకే మాట.. పుష్ప తగ్గేదే లే..`` అంటూ బన్ని తనదైన స్టైల్లో పంచ్ విసరడంతో వేదిక వద్ద స్టైలిష్ స్టార్ అభిమానులంతా ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే ఆయన ఈ డైలాగ్ వినిపించిన వేదిక ఏదీ? అంటే.. కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా ప్రీరిలీజ్ వేదికపై ఇలా పుష్ప గురించి వ్యాఖ్యానించి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు.
``చావు కబురు ఎప్పుడూ చల్లగా చెప్పాలి. పుష్ప గురించి చివర్లో చెప్పాలి`` అంటూ తనదైన స్టైల్లో స్పీచ్ ఆరంభించి చాలా ఆసక్తిని రేకెత్తించారు బన్ని. వెళ్లేప్పుడు పుష్ప గురించి ఒక్కమాట చెప్పాలి. మీరు నా బలం.. ఆర్మీ.. ప్రాణం.. స్వతహాగా సంపాదించుకున్నానంటే అది కార్ కాదు.. కోట్లు కాదు.. మీ అభిమానం .. గర్వపడేంత వరకు తీసుకెళ్తాను. ఇది నా ప్రామిస్. పుష్ప గురించి ఒకే మాట.. పుష్ప తగ్గేదే లే..`` అంటూ స్పీచ్ ముగించారు. చావు కబురు చల్లగా మీకు కూడా నచ్చుద్ది. ఈ సినిమాలో కొత్త విషయం ఉంది అని బన్ని తెలిపారు. బస్తీ బాలరాజు గా కార్తికేయ అందరికీ నచ్చుతాడని అన్నారు.