అల్లు వారి అమెరికా యాత్ర కలిసొచ్చేనా

Update: 2017-06-28 07:29 GMT
చాలా అంచనాలు​ - ఫాన్స్ అభిమానం​ - మధ్య విడుదలైన స్టైలిష్ స్టార్ ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా విడుదలై నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాని బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్లు పెంచుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. మన తెలుగులో ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే ఆ చిత్ర యూనిట్ కు సినీ విమర్శలకు ఒకింత అయోమయంగాను విడ్డూరంగాను అనిపించింది. అయితే మంగళవారం నుండి వర్కింగ్ డేస్ కావడంతో.. కలక్షన్లు తగ్గుముఖం పట్టాయి. అమెరికాలో అయితే సీన్ మరోలా ఉంది.

‘దువ్వాడ జగన్నాధం’ మొదటి వీకెండ్లో 1 మిలియన్ క్లబ్ లో చేరడంలో విఫలం అయ్యింది. అయితే క్రమక్రమేణ పుంజుకొని మొత్తానికి 1 మిలియన్ బెంచ్ మార్క్ దాటుతుంది కాసి.. 2 మిలియన్ వస్తేనే అక్కడి పంపిణీదారుడు సేఫ్‌. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ టీమ్ యూ‌ఎస్ వెళ్ళి అక్కడ సినిమా ప్రచారం చేసి కలెక్షన్లు మరింత పెంచే ప్లాన్లో ఉన్నారు. గురువారం రాత్రికి బయలుదేరుతున్నారు. అసలు విడుదలకు ముందే వెళ్లవలిసింది.. అప్పుడు ఇంకాస్త బెటర్ గా పైసల్ వచ్చేవి. కాని మొత్తంగా ఓవర్సీస్ లో బిలో యావరేజ్ టాక్ వచ్చేశాక.. ఇప్పుడు వెళ్ళి ప్రచారం చేస్తే ఏం లాభం?

ఏది ఏమైనా వస్తున్న శుక్రవారం వరకు వేచిచూడవలిసిందే  అల్లు వారి అమెరికా యాత్ర సృష్టించే కొత్త  ఫలితాలు కోసం. ఒకవేళ బన్నీని చూడడానికి అభిమానులు వచ్చేస్తే.. ఖచ్చితంగా ఈ వీకెండ్ అమెరికాలో కాస్త మంచి కలక్షన్లే వసూలు అవుతాయి. లెటజ్ సీ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News