లావణ్యకు వింత సలహా ఇచ్చిన అల్లు అరవింద్‌

Update: 2021-03-18 13:30 GMT
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌ గా కొనసాగుతున్న ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు దక్కించుకోలేక పోతుంది. ఒక హిట్ రెండు ఫట్ అన్నట్లుగా ఈమె కెరీర్‌ సాగుతుంది. ఇటీవల ఈమె నటించగా విడుదల అయిన ఏ1 ఎక్స్‌ ప్రెస్ సినిమా కూడా నిరాశ పర్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ చాలా నమ్మకం పెట్టుకుని చావు కబురు చల్లగా సినిమాతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అరవింద్ తో లావణ్య త్రిపాఠికి ఒక సరదా సంఘటన జరిగింది. ఇప్పుడు అది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

చావు కబురు చల్లగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ తన పట్ల తెలుగు అభిమానులు కనబర్చుతున్న అభిమానంకు థ్యాంక్యూ చెబుతున్న సమయంలో పక్కనే ఉన్న అల్లు అరవింద్ మైక్‌ లాగేసుకుని తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు ఒక తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వచ్చు కదా అన్నాడు. అందుకు లావణ్య త్రిపాఠి గట్టిగా నవ్వేసింది. లావణ్య త్రిపాఠి చావు కబురు చల్లగా సినిమా లో భర్త చనిపోయిన అమ్మాయిగా కనిపించింది. ఒక సింపుల్‌ పాత్రను ఆమె చేసింది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చిన లావణ్య ఈసారి డీ గ్లామర్‌ గా కనిపించింది. మరి లావణ్యను ఈ సారి జనాలు ఆధరిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News