అల్లు శిరీష్ గొప్ప ఉద్య‌మం మొద‌లుపెట్టాడు

Update: 2020-06-17 17:30 GMT
మ‌నం భార‌తీయులం, భార‌త ఉత్ప‌త్తుల‌నే వాడుదాం.. త‌ద్వారా మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ‌లాన్నిద్దాం.. ఎప్పుడూ వినిపించే మాట‌లే ఇవి. మనం ఇతర దేశాల ఉత్పత్తులు వాడకం వల్ల మన డబ్బు ఇతర దేశాలకు తరలిపోవడమే కాకుండా, మన విదేశీ మారక నిల్వలు పడిపోతాయి. దీనివల్ల మన కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే మనం భారతీయ కంపెనీల ఉత్పత్తులును కొనడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందామంటూ నిపుణులు చెబుతూనే ఉంటారు. కానీ మ‌నం పాటించ‌లేం. ముఖ్యంగా మ‌న చేత్తో మ‌న కంటినే పొడిచే చైనాను దెబ్బ కొట్టాలంటే ఆ దేశం త‌యారు చేసే ఉత్ప‌త్తుల‌ను కొన‌కూడ‌ద‌ని తెలిసినా అనివార్యంగా ఆ ట్రాప్‌లో కొన‌సాగుతూ ఉంటాం.

ఐతే దీనికి ఎక్క‌డో ఒక చోట బ్రేక్ ప‌డాలి. ఎవ‌రో ఒక‌రు ఉద్య‌మం మొద‌లుపెట్టాలి. ఆ ప‌ని పెద్ద సెల‌బ్రెటీనే చేయాల్సిన ప‌ని లేదు. త‌న లాంటి చిన్న హీరో కూడా చేయొచ్చ‌ని అల్లు శిరీష్ చూపించాడు. దేశ స‌రిహ‌ద్దుల్లో చైనాతో యుద్ధంలో 20 మంది భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా చైనాపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. బాయ్ కాట్ చైనా గూడ్స్ ఉద్య‌మం మొద‌లైంది. ఇందులో టాలీవుడ్ నుంచి శిరీష్ కూడా భాగ‌మ‌య్యాడు. ‘‘నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకమీదట వీలైనంత వరకు స్వదేశీ బ్రాండ్స్ వాడదాం అని. దీని ద్వారా మన స్వంత ఎకానమీను బలోపేతం చేయవచ్చు. విదేశీ ప్రొడక్ట్స్ ఉపయోగించకపోవడం అసాధ్యమైనది. కానీ వీలైనంత వరకు లోకల్ కొనండి. మనలో చాలామంది భారతీయ బ్రాండ్స్ ఉపయోగించడం, ఆకాంక్ష కాదని భావిస్తారు. కానీ ఇకమీదట ఆలా కాదు. లోకల్ బ్రాండ్స్ వాడదాం. వాడుతున్నట్లు పైకి చెప్పుకుందాం. దయచేసి #GoLocalBeVocal.. మొన్న నేను సూపర్ మార్కెట్లో కొనుక్కున్న సామాన్లు. అన్ని భారతీయ బ్రాండ్స్’’ అంటూ తాను కొన్న ఉత్ప‌త్తుల ఫొటోలు పెట్టాడు శిరీష్‌. అత‌డి పోస్టుకు ట్విట్ట‌ర్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.
Tags:    

Similar News