అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. గత కొన్నేళ్ల నుండి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శిరీష్.. తాజాగా `ఊర్వశివో రాక్షసివో` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. సునీల్, వెన్నెల కిషోర్, ఆమని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలై తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. ప్రేమ, శారీరక బంధం, లక్ష్యాలు, సహజీవనం, పెళ్లి తదితర అంశాలను టచ్ చేస్తూ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.
కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా రొమాంటిక్ సన్నివేశాలు, నాన్ స్టాప్ కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అలాగే మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీ కుమార్ అనే కుర్రాడి పాత్రలో అల్లు శిరీష్ ఒదిగిపోయి నటించాడు. మోడ్రన్ అమ్మాయి సింధూజ పాత్రకు అను ఇమ్మాన్యుయేల్ పూర్తి న్యాయం చేసింది.
మొత్తానికి సక్సెస్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న శిరీష్ ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు శిరీష్.. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సహజీవనం చేసి పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టమంటూ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు.
శిరీష్ మాట్లాడుతూ.. `నాకు వివాహ వ్యవస్థ పై నమ్మకం ఉంది. అయితే సహజీవనంతో జర్నీని స్టార్ట్ చేసి పెళ్లి చేసుకోవడాన్ని ఇష్టపడతా. నా పెళ్లి విషయంలో ఇంట్లో ఒత్తిడేమీ లేదు. పెళ్లనేది కూడా హిట్ సినిమా లాంటిది. దానంతట అదే రావాలి తప్ప.. మనం అనుకుంటే రాదు` అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
అలాగే కెరీర్ గురించి స్పందిస్తూ.. తనకు కథ బాగా నచ్చితే తప్ప సినిమా చేయనని, అందుకే సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ వస్తుందని శిరీష్ తెలిపాడు. ఇక ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే వాటి వివరాలను వెల్లడిస్తామని శిరీష్ పేర్కొన్నాడు. దీంతో ఆయన కామెంట్స్ కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.