పిల్లలు ఏమి చేసినా అది తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళు పుట్టిన దగ్గర నుండి ప్రతీ చిన్న విషయం వారికి మధురానుభూతిని మిగులుస్తుంది. వాళ్ళు ఫస్ట్ మాట్లాడిన మాట, వాళ్ళు వేసిన అడుగు, వాళ్ళు పాడే పాట, వాళ్ళు ఆడే ఆట... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీది వాళ్ళ లైఫ్ లో ప్రత్యేకమే. వాళ్ళు చేసే అల్లరి కూడా పేరెంట్స్ కి ఇష్టమే. వాటిని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్, స్నేహరెడ్డి కూడా ఇదే అనుభూతిని పొందుతున్నారు. బన్నీ, స్నేహరెడ్డి దంపతుల గారాల పిల్లలు అయాన్, అర్హ. వీళ్లిద్దరు లైఫ్ లోకి వచ్చిన తర్వాత తనలో ఎన్నో మార్పులొచ్చాయని అల్లు అర్జున్ ఎప్పుడూ చెప్తుంటాడు. నిన్న కొడుకు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందర్నీ భావోద్వేగానికి గురి చేసిన సంగతి తెలిసిందే.
చిన్న పిల్లల పుట్టినరోజులు తల్లిదండ్రులకు పండగలాంటిదే. కొత్తబట్టలు కొని, వాళ్లతో కేక్ కట్ చేయించి, పిల్లలందరికీ చాక్లెట్లు పంచి ఎంతో ఆనందంగా పుట్టినరోజు వేడుకను జరుపుకుంటారు. కానీ కరోనా కారణంగా అయాన్ బర్త్ డే ను సింపుల్ గా ఇంట్లోనే సెలబ్రేట్ చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ దంపతులు కొడుకు అయాన్ వీడియో మరొకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో అల్లు అయాన్ ఏ సపోర్ట్ లేకుండా ఒక టేబుల్ పైకి జంప్ చేస్తున్నాడు. దీన్ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన స్నేహరెడ్డి 'నింజా లైఫ్..నింజా జంప్ బై.. లిటిల్ నింజా' కామెంట్స్ యాడ్ చేసింది. ఈ వీడియోను అల్లు అర్జున్ ఎడిట్ చేశాడంటూ బన్నీని మెన్షన్ చేసింది. క్వారంటైన్ టైమ్ అల్లు ఫ్యామిలీ ఇలా ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు 'తండ్రికి తగ్గ తనయుడు', ,లిటిల్ స్టైలిస్ట్ స్టార్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.