మ‌ద్యం తాగించి రేప్ చేశాడు!

Update: 2018-10-09 15:45 GMT
సుచీలీక్స్ - శ్రీరెడ్డి లీక్స్ త‌ర్వాత ప్ర‌స్తుతం బాలీవుడ్‌ లో కొత్త ఉద్య‌మం ఊపందుకుంది. ఈ ఉద్య‌మ‌మే త‌నూశ్రీ లీక్స్ అని అనొచ్చు. ప్ర‌స్తుతం ఇది బాలీవుడ్‌ ని దావాన‌లంలా చుట్టేస్తోంది. బాలీవుడ్‌ లో కాస్టింగ్ కౌచ్ ర‌చ్చ మ‌రోసారి అంత‌కంత‌కు ప‌తాక స్థాయికి చేరుతోంది. ఇందులో ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాల పేర్లే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది మీటూ ఉద్య‌మం హాలీవుడ్ మొత్తం దావానంలా చుట్టేసిన‌ట్టే ఈసారి బాలీవుడ్‌ని చుట్టేస్తోంది. ఇప్ప‌టికే నానా ప‌టేక‌ర్‌, వికాస్ బాల్, గౌరంగ్ దోషి లాంటి వారి పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప‌లువురు క‌థానాయిక‌లు బ‌హిరంగంగా వేదింపుల ఘ‌ట్టాల్ని వెల్ల‌డించారు. త‌నూశ్రీ ద‌త్తా - కంగ‌న ర‌నౌత్ - ఆషా శైనీ - అతిధీరావ్ హైద‌రీ - నాయ‌ని ధీక్షిత్ ఇంత మంది పేర్లు బ‌య‌టికి వ‌చ్చేశాయి. వీళ్లంతా బాధితులే.

లేటెస్టుగా ప్రముఖ రచయిత - నిర్మాత‌ అయిన వింటా నందా తనకు ఎదురైన లైంగిక వేధింపుల వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌ పెట్టి పెద్ద షాకే ఇచ్చారు. దాదాపు 20 ఏళ్ళ క్రితం బాలీవుడ్ టీవీ-సినీ సీనియ‌ర్ న‌టుడు అలోక్‌ నాథ్ త‌నని బ‌ల‌వంతంగా రేప్ చేశాడ‌ని - మ‌ద్యం తాగించి దుర్మార్గానికి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. అత‌డు ఎంద‌రినో లైంగికంగా వేధించాడు. పైకి మాత్రం పెద్ది మ‌నిషిలాగా చెలామ‌ణి అవుతాడు - చీక‌టి ప‌డితే చాలు విశ్వ‌రూపం చూపిస్తాడు. అత‌గాడి రాస‌లీల‌లు అన్నీ ఇన్నీ కావు. ఎంద‌రో బ‌ల‌య్యార‌ని వింటా నందా ఫైర‌య్యారు. దీంతో ఈ వ్యవ‌హారం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

అయితే ఇలా ఒక‌రొక‌రుగా త‌మ గోడు వెల్ల‌బోసుకుంటుండ‌డంతో బాలీవుడ్ మాత్రం పూర్తి క‌న్ఫ్యూజ‌న్‌ లోకి వెళ్లిపోతోంది. ఇందులో ఏది నిజం?  ఏది క‌క్ష సాధింపు? అన్న కోణంలో కూడా ఆలోచించాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఇందులో కొన్ని నిజాలు ఉన్నా - మ‌రికొన్ని వృత్తిగ‌త‌మైన వ్య‌వ‌హారాల్లో వైరంతో కూడుకున్న‌ కక్ష సాధింపులు ఉండొచ్చ‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే మ‌గువ‌లు ఆరోపిస్తే ఆ వార్త‌కు ఉండే బ‌లం వేరు. సామాజిక మాధ్య‌మాల్లోనూ వెంట‌నే ఆ వార్త‌లు జోరుగా వైరల్ అయిపోతుండ‌డంతో అందులో వాస్త‌వం ఏదో తెలిసే అవ‌కాశం లేద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. బాలీవుడ్‌లో మీటూ హ్యాష్ ట్యాగ్ ఉద్యం పేరుతో ఇంకా ఎంతమంది బిగ్ షాట్స్ పేర్లు లీక‌వుతాయోన‌న్న ప్ర‌కంప‌నాలు సాగుతున్నాయి. సుచీ లీక్స్ - శ్రీ‌రెడ్డి లీక్స్ వ్య‌వ‌హారం త‌ర్వాత మళ్లీ అంత ఊపు తెస్తోంది ఈ ఉద్య‌మం.
    

Tags:    

Similar News