''మన దేశంలో ఎంతోమంది సూపర్ స్టార్లు ఉన్నారు.. చిరంజీవి గారు.. అమితాబ్ బచ్చన్.. రజనీకాంత్.. మమ్ముట్టి.. మోహన్ లాల్.. అయితే క్రియేటివ్ హీరోలు వేరు.. వారు.. అమీర్ ఖాన్ - కమల్ హాసన్ అండ్ పవన్ కళ్యాణ్ మాత్రమే.. వీరు క్రియేటివ్ హీరోలు. జనవరి నుండి షూటింగ్ కు వెళ్తున్నా.. ఏప్రియల్ 8కే వస్తుంది అన్నారు. ఎంతో కష్టపడితే కాని ఇలా టైమ్ కు సినిమా రాదు. అది కేవలం పవన్ కళ్యాన్ కే చెల్లుతుంది'' అంటూ ఒక షార్ట్ స్పీచ్ ఇచ్చాడు ఏ.ఎం.రత్నం. ఈయనెవరో గుర్తున్నారా?? అవును. ఆయనే.
అదేనండీ పవన్ కళ్యాన్ తో అప్పట్లో ''ఖుషీ''.. ఆ తరువాత ''బంగారం'' సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్ ఆయన. ఆ మధ్యలో ''సత్యాగ్రాహి'' అంటూ పవన్ డైరక్షన్ లో ఒక సినిమాను రూపొందించాలి కాని.. ఎందుకో దానిని ఆపేశారు. అయితే ఈయన జనవరి నుండి కంటిన్యూస్ గా ''సర్దార్ గబ్బర్ సింగ్'' షూటింగ్ స్పాటుకు వెళ్తున్నా.. అంటూ చెప్పడం అందరికీ చాలా సందేహాలే కలిగించింది. రూమర్లలో మనం వింటున్నట్లు.. ''ఖుషీ 2'' సినిమాను రూపొందించేది ఈయనేనా? పవన్ కళ్యాణ్ ఈయనకు మరోసారి ప్రొడ్యూసర్ గా ఛాన్సిస్తున్నాడా? లేకపోతే ఛాన్సివ్వమని ఇలా తిరుగుతున్నాడా?