అఖిల్‌ కి క్లారిటీ ఇచ్చిన అమ‌ల‌

Update: 2015-11-09 04:47 GMT
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్ సినిమాలో అమ‌ల గారు న‌టిస్తున్నారు.. నిజ‌మేనా? అని ప్ర‌శ్నిస్తే అఖిల్ అక్కినేని స‌ర్‌ ప్రైజ్ అయ్యాడు. అవునా ? అమ్మ న‌టిస్తోందా?  నాకు తెలీదే అంటూ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశాడు. అయితే అత‌డికి ఇప్పుడు క్లారిటీ వ‌చ్చి ఉంటుంది. నిజ‌మే.. క‌మ‌ల్‌ హాస‌న్ సినిమాలో అమ‌ల అక్కినేని న‌టిస్తున్నారు. ఓ త‌మిళ సినిమా కోసం ముఖానికి రంగేసుకుని చాలా కాల‌మే అయ్యింది. ఇన్నాళ్టికి క‌మ‌ల్ ఇచ్చిన ఆఫ‌ర్‌ ని తిరస్క‌రించ‌లేక‌పోయాను... అని అమ‌ల అక్కినేని క్లారిటీ ఇచ్చారు.

ఈ ప్రాజెక్టు గురించి అమ‌ల మాట్లాడుతూ.. క‌మ‌ల్‌ హాస‌న్ చాలా ప్లాన్డ్‌ గా ఉంటారు. ప్ర‌తిదీ ప‌క్కా క్లారిటీతో ఉంటారు. ఓరోజు ఫోన్ చేసి అడిగారు. మీరు ఇప్ప‌టికీ న‌టిస్తూనే ఉన్నారా? న‌టించే ఆలోచ‌న ఉందా? అని అడిగారు. ఎస్‌.. త‌ప్ప‌కుండా న‌టిస్తాను. అయితే నేను ఉన్న బిజీలో ఏదైనా కామియో రోల్ అయితేనే చేస్తా. కామియో క్వీన్ అనిపించుకోవాల‌నుంది అని అన్నాను. పెర్పెక్ట్‌. అలాంటి క్యారెక్ట‌రే ఒక‌టి ఉంది చేస్తారా? అని అడిగారు. వెంట‌నే ఎస్ చెప్పాను.. అంటూ అమ‌ల అక్కినేని ఆ ప్రాజెక్టుకు ఎలా అంగీక‌రించింది చెప్పారు. ఇది త‌మిళ్‌, మ‌ల‌యాళం ద్విభాషా చిత్రం.                       

కెరీర్ ఆరంభంలోనే క‌మ‌ల్ హాస‌న్‌ తో త‌మిళంలో పెసుమ్‌ - పాద‌మ్ వంటి ప్రాజెక్టుల్లో న‌టించాను. త‌మిళ్‌ లో బోలెడంత ట్రాక్ రికార్డు ఉంద‌ని అమ‌ల చెప్పారు. యానిమ‌ల్ వెల్ఫేర్ యాక్టివిటీస్‌ - ప‌ర్స‌న‌ల్ లైఫ్ బిజీ వ‌ల్ల‌నే నేను న‌టించ‌డం లేదు. వీలున్న‌ప్పుడు, క‌మ‌ల్‌హాస‌న్ లాంటి స్టార్లు ఇచ్చే ఛాన్సులేవీ మిస్ చేసుకోకుండా న‌టిస్తాన‌ని అన్నారు.
Tags:    

Similar News