తమిళంలో నటిగా మంచి పేరును దక్కించుకున్న ముద్దుగుమ్మ అమలాపాల్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అయితే అనూహ్యంగా ఆమె కెరీర్ పెళ్లి వల్ల కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. విడాకులు కూడా ఆమె కెరీర్ పై ప్రభావం ను చూపించాయి.
హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్న ఆమె మళ్లీ టాలీవుడ్ లో నిలదొక్కుకోలేక పోయింది. అయితే ఇతర భాషల్లో మాత్రం ఈ అమ్మడు బిజీగా వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతోంది.
నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఛాలెంజింగ్ పాత్రలు చేస్తూ ఉన్న అమలా పాల్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 12 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అమలాపాల్ మాట్లాడుతూ... జీవితంలో ఒకానొక సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నేను ఒక పాత్ర కోసం పరిగెడుతున్నట్లుగా అనిపించేది. పాత్రల కోసం సక్సెస్ కోసం వెంపర్లాడుతున్నట్లుగా అనిపించేది. వర్తమానం లో జీవించడం లేదని... అందరికి దూరంగా ఉంటున్నట్లుగా అనిపించేది. ఆ సమయంలో నాలో నేను చాలా మదన పడ్డాను.
సినిమా ఇండస్ట్రీలో ఎందుకు కొనసాగుతున్నానో అర్థం కాకపోయేది. అప్పుడే సినిమాలను వదిలేయాలి అనేంత డిప్రెషన్ కు వెళ్లి పోయాను. అప్పుడే నాన్న చనిపోయారు. అప్పుడు నన్ను చాలా భయాలు వెంటాడేవి. కాని నేను ఒక యోధురాలిగా వాటన్నింటికి సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్లాను. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అన్నట్లుగా నిలిచి నాకు నేను మళ్లీ విజయం వైపు తీసుకు వెళ్లాను.
ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది.. నా పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్క సందర్భంలో కూడా నన్ను నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన తీరు నాకు నచ్చుతుంది అన్నట్లుగా అమలాపాల్ చెప్పుకొచ్చింది. నిజంగానే అమలా పాల్ 12 ఏళ్ల సినీ కెరీర్ ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.