మనసు తెలుసుకుని మనువాడే వాడు దొరికినప్పుడు వెంటనే పెళ్లాడేయాలి. అదే కరెక్ట్. ఈ విషయంలో నేను చాలా లక్కీగాళ్ ని అని చెబుతోంది అమలాపాల్. నన్ను అర్థం చేసుకునే నావాడు దొరికాడు. పెళ్లి తర్వాత కూడా నటించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. పెళ్లయితే ట్యాలెంటు ఎక్కడికీ పోదు కదా. అందుకే తిరిగి నేను నటనలో బిజీ అయిపోతున్నా.. అని చెబుతోంది అమలాపాల్. ఈ భామ తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కెరీర్ సంగతుల్ని ఓ మారు నెమరు వేసుకుంటూ..
ఆరంభమే నేను ఓ కాంట్రవర్శియల్ కాన్సెప్టు ఉన్న సినిమాలో నటించాను. టైటిల్ సింధు సమావేళి. ఆ చిత్రంలో మామతో అక్రమసంబంధం నడిపించే కోడలుగా నటించాను. ఇది చూసి తీవ్ర విమర్శలు చెలరేగాయి. తమిళంలో నిషేధించమన్నారు. నాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. .. ఆ సినిమా తర్వాత మైనా (ప్రేమ ఖైదీ) చిత్రంతో చక్కని ప్రశంసలొచ్చాయి. రజనీకాంత్ - కమల్‌హాసన్ వంటి సూపర్ స్టార్ లు పిలిచి మరీ అభినందించారు.. ఆ తర్వాత తంబీలు నన్ను ప్రేమించడం మొదలు పెట్టారు.. అంటూ చెప్పుకొచ్చింది. థింక్ బిగ్ స్టూడియోస్ కంపెనీ ప్రారంభించాను. నిర్మాతగా - నటిగా - గృహిణిగా అన్ని బాధ్యతల్ని నెరవేర్చాలి. డ్యాన్స్ - స్విమ్మింగ్ - యోగాతో నన్ను నేను సన్నజాజిలా తయారు చేసుకుంటున్నా. బాగా తిని జిమ్ చేయడం అలవాటు లేదు... అంటూ మల్టిపుల్ సంగతులు చెప్పుకొచ్చింది ఈ భామ.