45 వయసులో జూలీ ఈజ్ బ్యాక్
అదే సమయంలో నేహా ధూపియా ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తూనే ఉన్నాయి. నేహా లేటెస్ట్ ఫోటోషూట్ అగ్గి రాజేస్తోంది.
`జూలీ` నేహా ధూపియా పరిచయం అవసరం లేదు. NBK `పరమవీరచక్ర`లో యాక్షన్ క్వీన్‌గా స్టంట్స్ తో అదరగొట్టిన ఈ బ్యూటీ.. అంతకుమందే జూలీ(కామిని)గా యువతరం హృదయాలను కొల్లగొట్టింది. నేహా 45 వయసులోను, పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాతా అందం ఆకర్షణలో స్టన్నర్ అని నిరూపిస్తోంది. ఏజ్ లెస్ బ్యూటీ నేహాధూపియా బుల్లితెర హోస్ట్ గా, జడ్జిగాను రాణిస్తున్నారు.
అదే సమయంలో నేహా ధూపియా ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తూనే ఉన్నాయి. నేహా లేటెస్ట్ ఫోటోషూట్ అగ్గి రాజేస్తోంది. స్టన్నింగ్ డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ శారీలో టూ హా*గా కనిపిస్తోంది. నేటితరంతో పోటీపడుతూ యువతరం హృదయాలను కొల్లగొడుతోందని, బ్లాక్ డిజైనర్ శారీలో ఎంతో అందంగా ఉందంటూ యూత్ ప్రశంసిస్తున్నారు. బాధ్యతాయుతమైన మామ్ అయినా నేహాధూపియా అందం ఏమాత్రం సడలనేలేదు! అంటూ యూత్ పొగిడేస్తున్నారు. `జూలీ ఈజ్ బ్యాక్` అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాల్లో కీర్తిస్తున్నారు.
నిజానికి నేహా ధూపియా జూలీ సీక్వెళ్లతో అలరిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సిరీస్ నుంచి ధూపియా తప్పుకుంది. ప్రస్తుత కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఇటీవల `బాడ్ న్యూజ్`లో కనిపించింది. 2021లో బిగ్ బాస్ 15 ఇంటి సభ్యురాలిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం టీవీ రియాలిటీ షోల జడ్జిగా కనిపిస్తోంది. రోడీస్ డబుల్ ఎక్స్ జడ్జిగాను నేహా ప్రత్యేక ఆకర్షణను కొనసాగిస్తోంది. నేహా ధూపియా సినిమాల్లోకి రాక మునుపు టాప్ మోడల్ గా కొనసాగింది. ఇప్పుడు మళ్లీ దక్షిణాదిన మంచి అవకాశాలు వస్తే నటించాలని ఉవ్విళ్లూరుతోందని సమాచారం.