సైఫ్ దాడి కేసు: భర్త వెర్షన్‌తో పోలని కరీనా వెర్షన్
ఆ సమయంలో 12వ అంతస్తులోని ఫ్లాట్‌లో జరిగిన దోపిడీ ప్రయత్నం సందర్భంగా జరిగిన సంఘటనల క్రమం గురించి సైఫ్ - కరీనా ఇద్దరూ భిన్నమైన ప్రకటనలు ఇచ్చారు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా పోలీస్ విచారణలో భార్య వెర్షన్‌తో భర్త వెర్షన్ సరిపోలడం లేదనేది ప్రదాన ట్విస్టు. సైఫ్ అలీఖాన్, అతడి భార్య కరీనా పోలీసులకు ఇచ్చిన వెర్షన్లలో తేడాలు కనుగొనడంతో ఈ కేసు చుట్టూ ఉన్న రహస్యం మరింత తీవ్రమైందని పోలీస్ వర్గాలు తెలిపాయి. జనవరి 16న బాంద్రాన సైఫ్ పై దాడి జరిగింది. ఆ సమయంలో 12వ అంతస్తులోని ఫ్లాట్‌లో జరిగిన దోపిడీ ప్రయత్నం సందర్భంగా జరిగిన సంఘటనల క్రమం గురించి సైఫ్ - కరీనా ఇద్దరూ భిన్నమైన ప్రకటనలు ఇచ్చారు. ఆ ఇద్దరి వెర్షన్లు అసలు సరిపోలలేదు.
సైఫ్ ఖాన్‌ను షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30) అలియాస్ విజయ్ దాస్ అనే బంగ్లాదేశ్ జాతీయుడు అనేకసార్లు కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు. ఆరు కత్తిపోట్లు దిగాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ రాత్రి జరిగిన వాస్తవ సన్నివేశంపై మరింత స్పష్టత కోసం ముంబై పోలీసులు సైఫ్ , కరీనాల వాంగ్మూలాలను తీసుకున్నారు. కరీనా ప్రకటనకు అనుగుణంగా కొన్ని నిజాలున్నాయి.
ఘటనపై సైఫ్ పోలీసులతో మాట్లాడుతూ.. తాను తన భార్య కరీనా కపూర్ ఖాన్ సత్గురు శరణ్ భవనంలోని 11వ అంతస్తులోని తమ బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు తమ చిన్న కుమారుడు జహంగీర్ (జెహ్) రూమ్ నుంచి నానీ కేకలు విన్నామని చెప్పారు. ఆ గదికి వారు పరుగెత్తారు. జెహ్ ఏడుస్తుండగా నానీ - ఎలియామా ఫిలిప్స్ అరుస్తున్నట్లు సైఫ్ ఖాన్ పోలీసులకు తెలిపారు. దుండగుడిని ఆపడానికి ప్రయత్నించానని ఖాన్ చెప్పాడు. కానీ అతడు సైఫ్ వీపు, మెడ, చేతులపై అనేకసార్లు కత్తితో పొడిచాడు. గాయపడినప్పటికీ సైఫ్ అతడిని ఒక గదిలోకి నెట్టాడు. శ్రీమతి ఫిలిప్స్ జెహ్ పారిపోగా, అతడిని సైఫ్ స్వయంగా లోపల బంధించినట్టు చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
కానీ సంఘటనల క్రమం గురించి సైఫ్ భార్య కరీనా కపూర్ కథనంతో ఇది సరిపోలడం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. శుక్రవారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కరీనా 12వ అంతస్తు నుండి దిగి వచ్చినప్పుడు దాడి చేసిన వ్యక్తితో సైఫ్ పోరాడుతున్నట్లు తాను చూశానని పేర్కొంది. సైఫ్ అలీ ఖాన్ వైద్య నివేదిక కూడా విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. సైఫ్ ని ఆసుపత్రికి తీసుకువచ్చింది అతని కుమారుడు ఇబ్రహీం కాదు. అతని స్నేహితుడు అఫ్సర్ జైదీ.. `నేను ఏమీ చెప్పలేను` అని సైఫ్ వ్యాపార భాగస్వామి అయిన అఫ్సర్ జైదీని వైద్య నివేదికల గురించి అడిగినప్పుడు వ్యాఖ్యానించారని టైమ్స్ నవ్ తన కథనంలో పేర్కొంది.
భవనం లోపల సిసిటివిలో పట్టుబడిన నిందితుడు వాస్తవానికి దాడి చేసినవాడేనా? అని కూడా నిపుణులు ప్రశ్నించారు. దాడి చేసిన వ్యక్తి సైఫ్‌ను ఆరుసార్లు పొడిచి ఉంటే, అతడి శరీరంపై రక్తపు మరకలు ఉండాలి. కానీ అవి కనిపించడం లేదు అని సీనియర్ న్యాయవాది స్వప్నిల్ కొఠారి టైమ్స్ నౌతో అన్నారు. ఒక గోడ నుండి దూకడానికి మరో గోడ ఉంది. 1వ అంతస్తు నుండి 12వ అంతస్తు వరకు సీసీటీవీ కెమెరాలు లేవు. ఇటీవల 11వ, 12వ అంతస్తులలో కెమెరాలు ఏర్పాటు చేసారు. 6వ అంతస్తులో కూడా ఒక కెమెరా ఉంది! అని ఆయన తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి నిర్మల్ కౌర్ కూడా యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న వెర్షన్లలోని వ్యత్యాసాలను ప్రశ్నించారు. మీడియాలో ఏం జరుగుతుందో మాకు మాత్రమే తెలుసు. వాంగ్మూలాలు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. పోలీసులు తమ వాదనను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఏం జరిగిందో అధికారిక వెర్షన్ అదే అవుతుంది అని కౌర్ టైమ్స్ నౌతో అన్నారు.
ముంబై పోలీసులు సైఫ్ బాంద్రా నివాసం వెలుపల రెండు షిఫ్టులలో ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారు. బాంద్రా వెస్ట్‌లోని సైఫ్ అలీ ఖాన్ సత్గురు శరణ్ భవనం వెలుపల తాత్కాలిక పోలీసు రక్షణ కల్పించారు. బాంద్రా పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు కానిస్టేబుళ్లను రెండు షిఫ్టులలో అక్కడ పనికి నియమించారు. భద్రతలో భాగంగా సిసిటివి కెమెరాలు, విండో గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.