తమిళ దర్శకుడు విజయ్ సినిమాల్లో నటించిన హీరోయిన్ అమలా పాల్ అతడితో ప్రేమలో పడింది అనంతరం జూన్ 12 - 2014లో ఇద్దరూ వివాహం చేసుకోవడం తెలిసిందే. అమలా పాల్ క్రిస్టియన్ - విజయ్ హిందూ.. మతాలు వేరైనా పెద్దలు ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. రెండు సంప్రదాయాల ప్రకారం క్రిస్టియన్ పద్దతిలో ఎంగేజ్ మెంట్ - హిందూ పద్దతిలో లో వివాహం జరిగింది. అయితే పెళ్లై రెండేళ్లు గడిచిందో లేదో? అప్పడు వీరి సంసార బంధం బీటలవారుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమలా పాల్ - విజయ్ విడాకుల తీసుకోబోతున్నారంటూ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే పెళ్లైన సంవత్సరకాలంపాటు వీరి సంసారం హ్యాపీగానే సాగినట్లే తెలుస్తుంది. అప్పట్లో తమ వైవాహిక జీవితం అద్భుతంగా ఉందని ప్రపంచానికి చెప్పేక్రమంలో ఎన్నో ఫోటోలను - విషయాలను సోషల్ మీడియాలోనూ - మీడియా ఇంటర్వ్యూల్లోనూ చెప్పేది అమలా పాల్. అయితే ఈ ఆనందం ఒక సంవత్సరం పాటు కొనసాగిన తర్వాత క్రమ క్రమంగా మనస్పర్థలు రావడం మొదలయ్యాయట. దీంతో ఇద్దరూ కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారట.
అయితే సడన్ గా వీరి వైవాహిక జీవితానికి సంబందించి అఫీషియల్ విషయం తాజాగా తెలిసింది. హీరోయిన్ అమాలాపాల్ - దర్శకుడు విజయ్ ఆనంద్ లు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వీరిద్ధరూ తమ వివాహబందాన్ని రద్దుచేసుకుంటునట్లు కోర్టుకి తెలిపారు. శనివారం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన వీరిరువురూ పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేయాలని కోరారు. ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి ముందు హాజరైన వీరిద్దరూ హిందు వివాహ చట్టం ప్రకారం తమకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన న్యాయమూర్తి.. ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు కోర్టు రిజిస్ట్రిని సంప్రదించాల్సిందిగా వారికి సూచించారు. వీరిద్దరూ డబ్బు లేదా భరణం వంటి డిమాండ్లు ఏమీ చేయలేదు. కాగా ఆరు నెలల కాలవ్యవధి ముగిసిన తర్వాత వారిద్దరూ సమ్మతిస్తే విడాకులు మంజూరవుతాయి.