మొత్తానికి అమలాపాల్-ఎ.ఎల్.విజయ్ బంధం అధికారికంగానే తెగిపోనుందని తేలిపోయింది. ఇద్దరూ కలిసి పరస్పర అంగీకారంతో విడాకులకు కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేసేశారు. మ్యూచువల్ కన్సెంట్ తో వేసిన పిటిషనే కాబట్టి విడాకులు మంజూరు కావడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. ఐతే ఈ విడాకుల విషయంలో ఓ చిన్న ట్విస్టు ఉంది.
మామూలుగా సెలబ్రెటీలు విడాకులు పొందినపుడు.. భార్య భారీ స్థాయిలో భరణం డిమాండ్ చేయడం.. అందుకు అంగీకరించాకే విడాకులు పొందడం చూస్తుంటాం. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి కేసులు ఎన్నో చూశాం. ఐతే అమలా పాల్ మాత్రం తనకు భరణం ఏమీ వద్దని విడాకుల పిటిషన్లో పేర్కొనడం విశేషం. అమలకు అత్తింటి వేధింపులని.. సినిమాల్లో నటించకుండా ఆపుతున్నారని రకరకాల వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో విడాకుల విషయంలో జనాల సింపతీ అంతా అమల వైపే ఉంది. ఇప్పుడిక భరణం కూడా వద్దనడంతో ఆమె వైపు వెయిట్ మరింత పెరిగింది. అమలాకు హీరోయిన్ గా ఇప్పటికీ తమిళ మలయాళ భాషల్లో మంచి డిమాండే ఉంది. హీరోయిన్ గా బాగా సంపాదించుకోవడానికి ఛాన్సుంది. అందుకే ముందు ఈ బంధం నుంచి బయటపడితే చాలని అమలా భావిస్తున్నట్లుంది. చూడముచ్చటగా కనిపించిన ఓ జంట ఇలా పెళ్లయిన రెండేళ్లకే విడిపోవడం బాధాకరమైన విషయం.