సౌత్ నుంచి పలువురు కథానాయికలు బాలీవుడ్ లో ప్రవేశించి అగ్ర నాయికలుగా ఎదిగేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో అశిన్-త్రిష-కాజల్-తమన్నా-రకుల్ ప్రీత్- తాప్సీ లాంటి పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇదే జాబితాలో అమలాపాల్ పేరు చేరుతోంది. ఇప్పటికే దక్షిణాదిన అవకాశాలు తగ్గిన పాల్ ఇప్పుడు పూర్తిగా హిందీ సినిమాలపై కాన్ సన్ ట్రేట్ చేస్తోంది.
అక్కడ అజయ్ దేవగన్ లాంటి అగ్ర హీరో సరసన `భోలా`లో నటిస్తోంది. ప్రస్తుతం వారణాసిలో సినిమా షూటింగ్ ప్రారంభం కాగా సెట్స్ లో సందడి చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో అందాల అమలాపాల్ పాత్ర గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అమలాపాల్ ఈ చిత్రంలో బనారసీ మహిళగా నటిస్తోంది. నటీనటులు సాంకేతిక సిబ్బంది బెనారస్ లో ఒక వారం పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని భావిస్తున్నారు.
అజయ్ దేవగన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న `భోలా`లో అతని సన్నిహితురాలు టబు కూడా నటిస్తోంది. వీరిద్దరూ ఇటీవల విడుదలైన దృశ్యం 2లో కూడా భాగమయ్యారు. తాజాగా `భోలా` చిత్రంలో అభిషేక్ బచ్చన్ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. భోలా 2019లో విడుదలైన లోకేష్ కనగరాజ్ బ్లాక్ బస్టర్ తమిళ చిత్రం కైతికి అధికారిక హిందీ రీమేక్.
భోలా చిత్రం అమలాపాల్ కి మొదటి బాలీవుడ్ చిత్రం అయినా కానీ ఇదే మొదటి హిందీ ప్రాజెక్ట్ కాదు. ఈ భాషలో పాల్ అరంగేట్రం ఈ సంవత్సరం ప్రారంభంలో వూట్ వెబ్-సిరీస్ `రంజిష్ హాయ్ సాహి`తోనే మొదలైంది. ప్రముఖ ఫిలింమేకర్ మహేష్ భట్ జీవితం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అలాగే `అమ్నా పర్వేజ్` షోలో అమల పాత్ర దివంగత నటి పర్వీన్ బాబీ జీవితం నుండి ప్రేరణ పొందింది. ఇప్పుడు అగ్రహీరో అజయ్ దేవగన్ సరసన లక్కీ ఛాన్స్ దక్కింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.