పెళ్లైతే.. రీల్ లైఫ్ లో అమ్మేనా?

Update: 2016-06-28 06:31 GMT
అమలాపాల్.. చాలా ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అనడంలో ఎలాంటి సందేహాలు ఉండవు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చినా తెలుగు - తమిళ్ భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అన్ని భాషల్లోనూ భారీ చిత్రాలతో పాటే.. నటనకు అవకాశం ఉండే చిన్న సినిమాల్లో కూడా నటించి మెప్పించింది అమలాపాల్. ఇప్పుడీమె తల్లి పాత్రలో నటించిన 'అమ్మ కణక్కు' అనే తమిళ్ మూవీ రిలీజ్ అయింది.

హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉండగానే విజయ్ అనే దర్శకుడిని పెళ్లాడిన అమలాపాల్ కి.. ఈ మూవీ రీఎంట్రీ అని చెప్పచ్చు. అయితే అమ్మ కణక్కు విషయంలో మాత్రం కేవలం కాన్సెప్ట్ - స్టోరీ నచ్చడంతోనే ఆ సినిమా చేశానని చెబుతోంది అమలాపాల్. అంతే కానీ.. పెళ్లైపోయింది కాబట్టి అక్క - వదిన - అమ్మ రోల్స్ చేసేస్తాననే అర్ధం కాదని తేల్చేసింది. 'ఓ నటికి పెళ్లైతే అక్క - వదిన పాత్రలే చేయాలన్నట్లుగా స్టాంప్ వేసేస్తున్నారు. నేను హీరోయిన్ గా చేస్తున్నపుడే మలయాళంలో మిలీ - తమిళ్ లో పసంగ2 చిత్రాలలో నటించాను. రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటే రీల్ లైఫ్ లో అమ్మగానే నటించాలనే రూల్ లేదు. ఇప్పుడు అమ్మకణక్కులో పాత్రకు స్ఫూర్తి మా అమ్మే' అంటోంది అమలాపాల్.

అమ్మ కణక్కు మూవీలో సాధారణ గృహిణి - పనిమనిషి పాత్రలో నటించడంతో.. మేకప్ లేకుండానే చేసిందీ హీరోయిన్. అయితే పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈమెకు అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. తమిళ్ - మలయాళం - కన్నడ భాషల్లో చేసేస్తోంది. మలయాళంలో కుంజకోబొపన్ - జయసూర్యకు జంటగా షాజహానుమ్ పరికుట్టియమ్ చేస్తుండగా.. కన్నడలో సుదీప్ కి జోడీగా హెంబులి మూవీలో కనిపించనుంది అమలాపాల్.
Tags:    

Similar News