శ్రీవారి దర్శకత్వంలో ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Update: 2015-05-23 15:30 GMT
'నాన్న' అనే ఒక్క సినిమాలో నటించగానే దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌కు ప్రేమలో పడిపోయింది అమలా పాల్‌. ఇలా దర్శకుల ప్రేమలో పడ్డ హీరోయిన్లు చాలామందే ఉన్నారు కానీ.. ఆ ప్రేమను సార్థకం చేస్తూ వెంటనే పెళ్లి చేసుకున్న వాళ్లు చాలా తక్కువమంది. అమలా ఆ తక్కువ మందిలో ఒకరైంది. హీరోయిన్‌గా కెరీర్‌ ఏమవుతుందని ఆలోచించకుండా విజయ్‌ను వెంటనే పెళ్లాడేసింది. వివాహం తర్వాత గ్లామర్‌ క్యారెక్టర్లకు గుడ్‌బై చెప్పేసి మంచి మంచి పాత్రలతో దూసుకెళ్తోంది కేరళ బ్లాక్‌ బ్యూటీ.

మిగతా సినిమాల సంగతి సరే కానీ.. విజయ్‌ దర్శకత్వంలో అమలా మళ్లీ ఎప్పుడు నటిస్తుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోరికను ప్రభుదేవా తీరుస్తున్నాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌కే పరిమితమైపోయిన ప్రభుదేవా.. విజయ్‌ దర్శకత్వంలో హీరోగా మళ్లీ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్‌గా ఎవరిని పెడదామని డిస్కస్‌ చేస్తుంటే.. ప్రభుదేవా మాత్రం అమలా పాల్‌ అయితే బాగుంటుందని సూచించాడట. దీంతో విజయ్‌ కూడా ఓకే చెప్పాడట. మొత్తానికి ప్రభుదేవా సిఫారసుతో తన భర్త దర్శకత్వంలో నటించే ఛాన్స్‌ దక్కించుకుందన్నమాట అమలా.


Tags:    

Similar News