శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'అమర్ అక్బర్ అంటోని' ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ అయింది. ప్రీ-లుక్ తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా అనే హింట్ ఇస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచిన 'అమర్ అక్బర్ అంటోని' టీమ్ ఇప్పుడు మాస్ మహారాజా మూడు అవతారాలను రివీల్ చేసింది.
నాలుగు పేక ముక్కలు.. అందులో డైమండ్ ముక్కపై అమర్- ఆటిన్ ముక్కపై అక్బర్ - ఇస్పేటు(స్పేడ్)పై అంటోని గెటప్ లు బయటపెట్టారు మేకర్స్. ఆన్నీ 'A' లే. ఇక నాలుగో ముక్కపై ముగ్గురూ షాడో లైట్ లో కన్పించారు. ఈ ముక్కపై '3' నంబర్ ఉంది. వాళ్లకు బ్యాక్ గ్రౌండ్ ఒక సింబల్ గోల్డ్ కలర్ లలో మెరుస్తూ ఉంది. ఇవి కాకుండా బ్యాక్ గ్రౌండ్ చాలా పేక ముక్కలు కింద పడుతూ ఉన్నాయి. ఇక అమర్ పేక ముక్క కింద - అక్బర్ పేక ముక్క పైన 'రిటర్న్ గిఫ్ట్ అని రాసి ఉంది. అంటోనీ పేక ముక్కకు అలాంటిది లేదు. కానీ ముగ్గురూ ఉన్న అ '3' నంబర్ పేక ముక్కకు కుడి పక్క 'రిటర్న్ గిఫ్ట్' అని ఉంది. ఇవన్నీ చూస్తుంటే.. సినిమా కాన్సెప్ట్ ను పజిల్ రూపంలో ఈ రకంగా చెప్పినట్టుగా ఉంది. హింట్స్ అన్నీ ఉన్నాయిగా... ఇక కాన్సెప్ట్ ఎవరికి అర్థం అయినంత వారు అర్థం చేసుకోండి.
శ్రీను వైట్ల - రవితేజ కాంబినేషన్ అంటే 'వెంకీ'.. 'దుబాయ్ శీను' లాంటి హిలేరియస్ ఎంటర్టైనర్స్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ సినిమాలను చూసినా 'మనకు ఎదైనా సైకలాజికల్ సమస్య ఉంటె తప్ప' పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఇక ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది అని హింట్స్ ఇస్తున్నారు కాబట్టి వైట్ల - రవి కాంబోపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో కామెడి ట్రాక్స్ అదిరి పోయాయని -మాస్ రాజా మరో సారి తన విశ్వరూపం చూపిస్తాడని ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. మంచి కాన్సెప్ట్ ఉండి - దానికి మాస్ రాజా లాంటి ఎనర్జిటిక్ హీరో తోడైతే శ్రీనువైట్ల మ్యాజిక్ చేస్తాడని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. ఇక ముగ్గురు మాస్ రాజాలు ఒకేచోట ఉంటే ఆ హంగామానే వేరు. ఆ హంగామాను చూసే లోపు ఈ ఫస్ట్ లుక్ తో సరిపెట్టుకోండి..!