రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా 'కేజీఎఫ్' తెలుగు తో పాటు తమిళ.. హిందీ.. మలయాళం భాషలలో డిసెంబర్ 21 న రిలీజ్ అయింది. ట్రైలర్ తోనే సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్' బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించి మరోసారి సంచలనం సృష్టించింది. తెలుగులో పది కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి ఆ ఫీట్ సాధించిన మొదటి కన్నడ డబ్బింగ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది.
చిత్రమైన విషయం ఏంటంటే 'కేజీఎఫ్' హైదరాబాద్ లో ఇప్పటికే దాదాపు పదికి పైగా స్క్రీన్స్ లో ప్రదర్శింపబడుతూ ఉండడం. క్రిస్మస్.. న్యూ ఇయర్.. సంక్రాంతి సీజన్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ సినిమా థియేటర్లలో ఉందంటే 'కేజీఎఫ్' ఎలాంటి హిట్టో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 5 నుండి అందుబాటులో ఉంచుతామని అమెజాన్ వారు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తాజాగా వెల్లడించారు. "అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా లో కేజీఎఫ్: చాప్టర్ 1 కన్నడ తమిళం.. తెలుగు.. మలయాళం ఫిబ్రవరి 5 న విడుదల చేస్తున్నాం" అని ట్వీట్ చేశారు.