ప్రభాస్ 20వ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా అందరికి ఆసక్తి ఉంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా హిందీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు టైటిల్ ను జాన్ అనుకున్నారు కాని ఇప్పుడు మార్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓడియర్ తో పాటు మరో రెండు మూడు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తూ ఉన్నా కూడా బల్గేరియాలో ఈ చిత్రం షూటింగ్ నిరాటంకంగా జరుగుతూనే ఉంది.
ఇదే సమయంలో సినిమాకు బాలీవుడ్ స్టార్ కంపోజర్ అమిత్ త్రివేది పాటలను ట్యూన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ గత చిత్రం సంగీతం పరంగా నిరాశ పర్చింది. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకుల్లో ఎవరిని కూడా సాహో పాటలు ఆకట్టుకోలేదు. అందుకే యూవీ క్రియేషన్స్ నిర్మాతలు మరియు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
సౌత్ ఆడియన్స్ కు సుపరిచితుడు అయిన అమిత్ త్రివేదితో ఈ సినిమాకు పాటలు చేయించాలని నిర్ణయించారు. సైరా చిత్రంలో అమిత్ పాటలు ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాకు ప్రయోగం చేయకుండా అమిత్ తో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఎలా అయితే ట్యూన్స్ చేస్తారో అలా చేయించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన సిట్టింగ్స్ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.
సాహో కోసం ముగ్గురు నలుగురు సంగీత దర్శకులు వర్క్ చేశారు. అందుకే పాటలు కథకు సింక్ అయినట్లుగా లేకపోవడంతో పాటు ప్రేక్షకులను నిరాశ పర్చాయి. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఉగాది కానుకగా విడుదల చేస్తామంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. మరి కరోనా వంక చెప్పి ఏమైనా వాయిదా వేస్తారా అనేది చూడాలి.