2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపులరైంది థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ - బిగ్ బి అమితాబ్ బచ్చన్ - కత్రిన - సనా షేక్ లాంటి స్టార్లు నటించిన ఈ చిత్రానికి ట్యాలెంటెండ్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తుండడంతో కేవలం హిందీ పరిశ్రమలోనే కాకుండా ఇతరత్రా పరిశ్రమల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆ క్రమంలోనే ఈ సినిమాని కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తారా? ప్రాంతీయ భాషల్లోకి అనువాదమై రిలీజవుతుందా? అంటూ డిబేట్ మొదలైంది.
దీనికి దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ``దేశంలోని ప్రజలంతా చూడగలిగే సినిమాని తెరకెక్కించాను. యూనివర్శల్ కథాంశంతో విజువల్ బ్రిలియన్సీ ఉన్న చిత్రమిది. అందుకే అన్ని భాషల్లోనూ ప్రజలు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. తెలుగు - తమిళ్ లోనూ అనువదించి రిలీజ్ చేస్తాం. మనమంతా సినిమా లవర్స్. భాషతో పనే లేకుండా సినిమాల్ని ఆదరిస్తాం. అమితాబ్ బచ్చన్ - అమీర్ ఖాన్ లాంటి లెజెండ్స్ నటించిన యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఇది. విజువల్ ఫీస్ట్ గా ఉంటుంది. ఈ దీపావళికి సినిమాని రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు.
నా ఆలోచన ఒకటే. మనమంతా ఒకే కుటుంబం. సినిమా పట్ల ఒకటే భావన కలిగి ఉన్నాం. అందుకే ఈ చిత్రాన్ని షేర్ చేసుకుందాం.. థియేటర్లలో వీక్షిద్దాం.. అని విజయ్ కృష్ణ ఆచార్య అన్నారు. యశ్ రాజ్ ఫిలింస్ పంపిణీ వ్యవస్థ వైస్ ప్రెసిడెంట్ రోహన్ మల్హోత్రా మాట్లాడుతూ - ``మునుపెన్నడూ చూడని విజువల్ వండర్ ని చూడబోతున్నాం. నెవ్వర్ బిఫోర్ అని భావిస్తారు ప్రేక్షకులు. ఈ సినిమా కథ అలాంటిది. బందిపోట్ల గురించి - మెగా యాక్షన్ సినిమా గురించి వేచి చూస్తున్నాం`` అని అన్నారు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు వీక్షిస్తే ఈ సినిమా విజువల్ గ్రాండియారిటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. నవంబర్ 8న దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.