ఒక సినిమా హిట్ కావాలంటే హీరో హీరోయిన్లు.. డ్యాన్స్.. ఫైట్స్ ఉండాలనే ఫార్మాట్ కు ఇప్పుడు కాలం చెల్లింది. అవి ఉంటే వచ్చే నష్టమేమీ లేదు. లేకపోయినా అవేమీ బాక్స్ ఆఫీస్ విజయానికి అడ్డంకులు కాలేవు. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను 'పింక్' సినిమాతో బాలీవుడ్లో మంచి రికగ్నిషన్ సాధించిన విషయం తెలిసిందే. ఆఫ్ బీట్ స్టైల్ లో ఉండే కోర్ట్ రూమ్ డ్రామా అయిన 'పింక్' లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. తాప్సీ పన్ను కీలక పాత్రలలో నటించారు. బ్రిలియంట్ యాక్టింగ్ తో సాధారణ ప్రేక్షకులనే కాకుండా విమర్శకులను కూడా మెప్పించారు. ఇప్పుడు మరోసారి అమితాబ్ - తాప్సీ లు మరోసారి 'పింక్' ఫీట్ ను రిపీట్ చేశారు.
ఇద్దరూ కీలక పాత్రల్లో నటించిన సినిమా 'బద్లా'. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మార్చ్ 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. జస్ట్ 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకూ దాదాపుగా రూ.57 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మర్డర్ కేస్ లో నిందితురాలిగా తాప్సీ నటించగా.. అమితాబ్ ఒక అడ్వొకేట్ పాత్రలో నటించారు.
'పింక్'.. 'బద్లా' సినిమాల సక్సెస్ తో అమితాబ్ - తాప్సీ కాంబినేషన్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అతి తక్కువ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేసే వీలుండడంతో చాలామంది ఫిలిం మేకర్స్ వీరి కాంబినేషన్ లో సినిమాలను తెరకెక్కించేందుకు ముందుకొస్తున్నారట. త్వరలో అమితాబ్ - తాప్సీ కాంబోలో మరో చిత్రం రావడం ఖాయమే.