అమితాబ్ బచ్చన్ ఐదు దశాబ్ధాలుగా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న లెజెండరీ నటుడు. ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా ఆయన కూడా ఓ తండ్రే. తన కొడుకు పుట్టినరోజుల నాడు ఆ తండ్రి గుండె ప్రేమతో శుభాకాంక్షలు చెప్పింది. చిన్నప్పట్నించి తాను చూసిన కొడుకుని మరో సారి గుర్తు చేసుకుంది.
అభిషేక్ బచ్చన్ కు నేటితో 42 ఏళ్లు పూర్తయిపోతాయి.ఫిబ్రవరి5న అతని బర్త్ డే. తన పుట్టినరోజుల వేడుకలను ఆనందంగా చేసుకునేందుకు భార్య, కూతురుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు అభిషేక్. అతని తండ్రి అమితాబ్ తన కొడుక్కి పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పేందుకు తన పెన్నుకు పనిచెప్పాడు. ఆస్ట్రేలియాలో ఉన్న అభిషేక్... ఇండియాలో ఉన్న మనకన్నా అయిదు గంటల ముందుగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ మనకంటే అయిదుగంటల ముందుగానే సూర్యోదయం అయిపోతుంది కనుక. ఆస్ట్రేలియాలో ఉన్న అతడిని తండ్రి బ్లాగులోని ఉత్తరం పలకరించింది. ఆర్ధ్రత నిండిన ఒక్కో అక్షరం అతని పుట్టినరోజుని ఎంతో ప్రత్యేకంగా మార్చాయి.
చిన్నప్పుడు... రెండు చేతులు నోటిలో పెట్టుకుని, చలి తగల కుండా వెచ్చని జాకెట్టును వేసుకుని, జుట్టు విసాలమైన నుదుటితో పడుతుంటే, నాన్న ఒళ్లో కూర్చుని షూటింగ్ చూస్తున్న పిల్లాడు... ఇప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాడు. అప్పటికీ ఇప్పటికీ నా కొడుకు పెద్దగా మారింది లేదు. పొడవు పెరిగాడు - మనిషిలో మాత్రం అదే నిశ్శబ్ధత. చిన్నప్పట్నించీ ఉన్న ప్రశ్నలు వేసే అలవాటు మాత్రం వయసుతో పాటూ పెరిగింది... అని ఉత్తరంలో రాశారు. కొడుక్కి తండ్రి ఇచ్చే శుభాకాంక్షలే మరింత బలాన్నిస్తాయని రాశారు. అలాగే ట్విట్టర్ లో తన కొడుకు చిన్నప్పటి ఫోటోలను పంచుకున్నారు.