శంకర్ - రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో-2లో డానీ డెంజాంగ్ పా పోషించిన ప్రొఫెసర్ బోరా పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించి ఉంటే ఎలా ఉండేదో ఓసారి గుర్తు చేసుకోండి. ‘ఆగ్’ సినిమాలో మినహాయిస్తే ఎప్పుడూ హీరోగానే కనిపించిన అమితాబ్ ను ఆ విలన్ పాత్రలో సూటై ఉండడేమో కదా. శంకర్ మాత్రం అమితాబ్ ను ఆ పాత్రలో చూపించాలనుకున్నాడు. కానీ రజినీకాంత్ మాత్రం అందుకు ససేమిరా అన్నాడట. ఈ సంగతి అమితాబే స్వయంగా వెల్లడించాడు.
ఆరేళ్ల కిందట శంకర్ ‘రోబో’ స్క్రిప్టుతో తన దగ్గరికి వచ్చి, అందులో ప్రొఫెసర్ బోరా పాత్రకు తనను అడిగాడని.. ఐతే తర్వాత రజినీతో మాట్లాడితే.. ‘‘జనాలు మిమ్మల్ని విలన్ గా చూడ్డానికి ఇష్టపడరు’’ అని స్పష్టం చేయడంతో తాను ఆ పాత్ర చేయలేదని చెప్పాడు అమితాబ్. ఇక రోబో-2లోనూ తనను విలన్ పాత్రకు అడిగినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అమితాబ్ వెల్లడించాడు.
ఇక ధూమ్-4లో మీరే విలన్ పాత్ర పోషించబోతున్నారటగా అని అమితాబ్ ను అడిగితే.. ‘‘ఈ మాట తొలిసారి వింటున్నా’’ అని సింపుల్ గా తేల్చేశారు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ తో కలిసి ‘వాజిర్’ సినిమాను పూర్తి చేసిన అమితాబ్ త్వరలోనే ఆంఖే-2లో నటించబోతున్నట్లు వెల్లడించారు. ‘ఆంఖే’లో నటించన పాత్రనే ఇందులోనూ కొనసాగించబోతున్నట్లు ఆయన చెప్పారు.