స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తర్వాత సెల్ఫీల ట్రెండ్ మొదలైంది. అక్కడ, ఇక్క, వారితో, వీరితో అనే బేధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వారితో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈమద్య కాలంలో దాదాపు అందరు చేసే పని. అయితే కొన్ని సెల్ఫీలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అలాగే ఈ స్లిప్పర్ సెల్ఫీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఇది నిజంగా సెల్ఫీ ఏం కాదు, సెల్ఫీలా స్టిల్ మాత్రమే. ఈ స్లిప్పర్ సెల్ఫీ గురించి బాలీవుడ్ తారలు కూడా చర్చించుకుంటున్నారు.
అయిదుగురు కుర్రాళ్లు ఒక చెప్పుతో తీసుకుంటున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా ఫన్నీగా ఉన్న ఆ సెల్ఫీని ఎంతో మంది ప్రముఖులు కూడా షేర్ చేశారు. అయితే ఆ సెల్ఫీ ఫొటోపై అమితాబచ్చన్ కు అనుమానం వచ్చింది. అది నిజంగా తీసుకున్నదేనా, ఫొటో షాప్ ఎడిటా అనేది బిగ్ బి అనుమానం. అతుల్ కస్బేకర్ ట్విట్టర్ లో ఫొటోను పోస్ట్ చేయగా అమితాబచ్చన్ స్పందిస్తూ చెప్పుతో ఉన్న చేయికి, మొత్తం బాడీకి సంబంధం లేనట్లుగా ఉంది. అతడి మరో చేయికి స్లిపర్ పట్టుకున్న చేయికి సంబంధం లేనట్లుగా ఉందని తన అభిప్రాయం చెప్పాడు.
అమితాబ్ రైజ్ చేసిన ప్రశ్నకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎంతో మంది ఆ విషయమై ట్వీట్ చేశారు. ఇది రియల్ అని కొందరు, కాదు ఫొటో షాప్ ఎటిట్ అంటూ మరి కొన్ని లోపాలు చూపుతూ మరి కొందరు పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యారు. మొత్తానికి ఈ పిల్లల స్లిప్పర్ సెల్ఫీ వైరల్ అయ్యింది. ఇదే సమయంలో అది రియల్ దా లేకుంటే ఫొటో షాప్ ఎడిట్ చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.