తనదైన శైలిలో సినిమాలను చేసి ఎంతో స్టార్ హోదాను అందుకున్న వారిలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. ఒకప్పుడు ఆయన డేట్స్ దొరకాలంటేనే కష్టంగా ఉండేది బిజీ బిజీ షెడ్యూల్ తో కాలంతో పరుగెడుతూ ఉండేవారు. ఇక రెమ్యునరేషన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమా సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ ని పెంచుకునేవారు. కానీ ప్రస్తుతం ఆయన అప్పులు చేయాల్సి వస్తోందని బాలీవుడ్ లో అనేక కథనాలు వెలువడుతున్నాయి.
అది కూడా తన ఇంట్లోనే బిగ్ బి అప్పులు చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ టీవీ షోలతో అలాగే యాడ్స్ తో బాగానే సంపాదిస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో 104 కోట్ల వరకు ఋణాలు తీసుకున్న బిగ్ బి ఇప్పుడు అప్పులు కట్టడానికి సొంత ఇంట్లోనే అప్పులు చేస్తున్నారట. ఇప్పటికే ఒకసారి 50 కోట్లవరకు కొడుకు దగ్గర నుంచి తీసుకున్న అమితాబ్ రీసెంట్ గా కోడలి దగ్గర నుంచి కూడా 21 కోట్ల వరకు అప్పుగా తీసుకున్నారట.
ఇక అఫిడవిట్ ప్రకారం అయన సతీమణి జయ బచ్చన్ కూడా కొడుకు దగ్గర నుంచి రూ.1.4 కోట్లను తీసుకున్నారట. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. అమితాబ్ ప్రస్తుతం సినీ రంగంలో బాగానే సంపాదిస్తున్నారు. జయ బచ్చన్ కూడా వివిధ బిజినెస్ లను నడిపిస్తున్నారు మరి సడన్ గా వీరు కొడుకు కోడలి దగ్గర ఈ విధంగా అప్పులు చేయడం ఏమిటని కామెంట్ చేస్తున్నారు.