వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ - యంగ్ బ్యూటీ రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''ఒకే ఒక జీవితం''. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ బైలింగ్విల్ సినిమాతో శ్రీ కార్తిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇందులో అక్కినేని అమల కీలక పాత్ర పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - నాజర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
'ఒకే ఒక జీవితం' టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ - శర్వా స్నీక్ పీక్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'అమ్మ' సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా 2022 జనవరి 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ పాటని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.
తల్లి ప్రేమ ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైనది.. ఇప్పుడు 'ఒకే ఒక జీవితం' సినిమాలోని ఈ అమ్మ పాట కూడా అంతే స్పెషల్ గా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. జేక్స్ బీజోయ్ ఈ గీతానికి ట్యూన్ సమకూర్చగా.. దివంగత లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు.
టైమ్ మిషన్ సహాయంతో తమ బాల్యంలోకి వెళ్లిన ముగ్గురు స్నేహితులను కథే 'ఒకే ఒక జీవితం'. ఇందులో ముఖ్యంగా తల్లీ కొడుకుల మధ్య సెంటిమెంట్ ని చూపించబోతున్నారు. శర్వానంద్ తల్లిగా అమల కనిపించనుంది. ఇది శర్వా కెరీర్ లో 30వ చిత్రం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు మరియు ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు సంభాషణలు అందించారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అన్నీ అనుకున్నట్లు సవ్యంగా జరిగితే ''ఒకే ఒక జీవితం'' చిత్రాన్ని ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.