రివైండ్ : 2021లో హంగామా చేసింది వీరే

Update: 2021-12-30 10:30 GMT
టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ లు వున్నా వాళ్ల‌కి మించి భారీ స్థాయిలో డ‌బ్బులు దండుకునేది మాత్రం హీరోయిన్ లే. హీరోల‌కు మించి ప్రాజెక్ట్‌లు చేస్తుంటారు. ఒకే భాష‌లో కాకుండా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, మిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ అందిన కాడికి చేజిక్కించుకుంటుంటారు. అంతేనా.. వీరు చేయ‌ని క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ అంటూ వుండ‌వు.

భారీ బ్రాండ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ లుగా వ్య‌వ‌హ‌రిస్తూ రెండు చేతులా సంపాదించేస్తుంటారు. చిత్ర సీమ ఈ ఏడాది గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నా హీరోయిన్ లు మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. భారీ డిమాండ్ ని చూపించారు. త‌మ‌కు అంది వ‌చ్చిన అవ‌కాశాల్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా ఈ ఏడాది ఓ రేంజ్ లో హంగామా చేశారు.

ఈ ఏడాది హంగామా చేసిన హీరోయిన్ ల‌లో ముందుగా చెప్పుకోవాల్సింది స‌మంత గురించి. ఈ ఏడాది ఆమెకు మ‌ర్చిపోలేని ఇయ‌ర్ అన్న‌ది అంద‌రికి తెలిసిందే. నాగ‌చైత‌న్య‌తో విడాకులు కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన స‌మంత ఆ త‌రువాత కూడా అదే జోరుని కొన‌సాగించింది.

ఇక ఈ ఏడాది త‌ను న‌టించిన సినిమా ఏదీ ఈ ఏడాది విడుద‌ల కాలేదు కానీ స‌మంత ప్ర‌త్యేక గీతంలో న‌టించిన `పుష్ప‌` కార‌ణంగా వార్త‌ల్లో నిలిచింది. తొలిసారి ప్ర‌త్యేక గీతంలో న‌టించిన స‌మంత ఈ పాట కోసం ఏకంగా కోటిన్న‌ర తీసుకుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. `ఫ్యామిలీ మ్యాన్ 2`తో వార్త‌ల్లో నిలిచిన స‌మంత ప్ర‌స్తుతం `య‌శోద‌`లో న‌టిస్తోంది. దీనికి ముందు గుణ‌శేఖ‌ర్‌తో చేసిన `శాకుంత‌లం` చిత్రీక‌ర‌ణ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో వుంది.

ఆ త‌రువాత స్థానంలో నిలిచిన హీరోయిన్ త‌మన్నా. మాస్ట‌ర్ చెఫ్ రియాలిటీ షో నుంచి త‌ప్పుకున్న త‌మ‌న్నా ఈ ఏడాది వెండితెర‌పై మ్యాజిక్ చేయ‌లేక‌పోయింమ‌ద‌నే చెప్పాలి. `మాస్ట్రో`తో నెగెటివ్ పాత్ర‌లో మెప్పించాల‌ని ప్ర‌య‌త్నించినా అది పెద్ద‌గా ఫ‌లితాన్ని చూపించ‌లేక‌పోయింది. సెకండ్ వేవ్ కార‌ణంగా ఇది ఓటీటీకే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది.

ఇక `సీటీమార్‌`లో జ్వాలారెడ్డిగా న‌టించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇందు కోసం ప్ర‌త్యేకంగా తెలంగాణ యాస నేర్చుకున్నా త‌మ‌న్నాకు ఈ సినిమాతో వ‌చ్చిన లాభం ఏమీ లేదు. ప్ర‌స్తుతం త‌మ‌న్నా ఆశ‌ల‌న్నీ మెగాస్టార్ తో చేస్తున్న `భోళా శంక‌ర్‌`పైనే వున్నాయి. ఇదిఏ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

కీర్తి సురేష్ కు కూడా ఈ ఏడాది గ‌డ్డు కాల‌మే చెప్పాలి. `రంగ్ దే` యావ‌రేజ్ గా నిలిస్తే.. త‌మిళంలో ర‌జ‌నీ చేసిన `పెద్ద‌న్న‌` పెద్ద ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ `గుడ్ ల‌క్ స‌ఖీ` రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ తో చేసి `మ‌ర‌క్కార్` పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ప్ర‌స్తుతం కీర్తి చేతిలో `స‌ర్కారు వారి పాట‌`తో పాటు మెగాస్టార్ తో చేస్తున్న `భోళా శంక‌ర్‌` చిత్రాలు మాత్ర‌మే వున్నాయి. ఈ రెండు చిత్రాలు వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

ఆ త‌రువాత చెప్పుకోవాల్సిన హీరోయిన్ శృతిహాస‌న్. `కాట‌మ రాయుడు` త‌రువాత టాలీవుడ్ లో క‌నిపించ‌కుండా పోయిన శృతికి ఈ ఏడాది మాస్ మ‌హారాజా ర‌వితేజ `క్రాక్` రూపంలో శుభారంభం ల‌భించింది. ఈ మూవ ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో `వ‌కీల్ సాబ్‌`లోనూ మెరిసింది. ఇది కూడా హిట్ గా నిల‌వ‌డంతో ఇప్పుడు `స‌లార్‌`తో పాటు బాల‌కృష్ణ‌తో గోపీచంద్ మ‌లినేని చేస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇవే కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ల‌లో న‌టిస్తూ బిజీగా వుంది.

ఇక ఈ ఏడాది కూడా త‌న హ‌వాని కొన‌సాగించిన హీరోయిన్ పూజా హెగ్డే. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` పూజాకి పేరు తీసుకురావ‌డ‌మే కాకుండా అఖిల్ కి హిట్టిచ్చిన హీరోయిన్ అనిపించుకుంది. ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్ తో `బీస్ట్‌` చిత్రంలో న‌టిస్తున్నా... త‌న దృష్టంతా `రాధేశ్యామ్‌` పైనే వుంది. బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ వుండ‌టంతో అక్కడ కూడా సినిమాలు చేస్తున్న పూజా `ఆచార్య‌`లో చ‌ర‌ణ్ కు జోడీగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక క్రేజీ హీరోయిన్ ల జాబితాలో చెప్పుకోద‌గ్గ మ‌రో హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌. ఆమె న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`. బ‌న్నీ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో ర‌ష్మిక శ్రీ‌వ‌ల్లిగా న‌టించిన ఈ ఏడాది ల‌క్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఇదే ఏడాది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది.

ఇక స్వీటీ అనుష్క గురించి ఈ ఏడాది చెప్పుకోవ‌డానికి ఏమీ మిగ‌ల‌లేదు. `నిశ్శ‌బ్దం` మూవీ చేసినా అది ఎలాంటి శ‌బ్దం చేయ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం అనుష్క యువీ వారు తీస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో న‌టిస్తోంది. ఇందులో న‌వీన్ పొలిశెట్టి హీరో. ఇది వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక ర‌కుల్ గురించి చెప్పుకోవాలంటే ఈ ఏడాది రెండు చిత్రాల్లో చేసింది. అందులో ఒక‌టి నితిన్ తో చేసిన `చెక్‌`, రెండవ‌ది వైష్ణ‌వ్ తేజ్ తో చేసి `కొండ పొలం`. ఈ రెండూ ఫ్లాపులే. అయితే తెలుగులో మ‌రో సినిమా అంగీక‌రించ‌లేదు. బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తోంది. అక్క‌డే ఎక్కువ‌గా వుంటోంది. ఇలా కొంత మంది క్రేజీ హీరోయిన్ ల‌కు ఈ ఏడాది క‌లిసి వ‌స్తే మ‌రి కొంత మందికి చేదు జ్ఞాప‌కాల్ని మిగిల్చింది.


Tags:    

Similar News