మాములుగా తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత వింటూ ఉంటాం.. కానీ సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఈ సామెతను తారుమారు చేసే హీరో హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒకరే హైదరాబాదీ అమ్మాయి అమ్రీన్ ఖురేషీ. ఈ భామ ఇంతవరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ బాలీవుడ్ లో ఒకేసారి రెండు సినిమాలకు సంతకం చేసింది. అక్కడ ఎంట్రీ ఇచ్చాకే తెలుగులో చేస్తానంటుంది అమ్రీన్. తెలుగులో రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా 'సినిమా చూపిస్తా మావ'. ఈ సినిమాను హిందీలో 'బ్యాడ్ బాయ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి. అయితే ఇందులో హీరోకి కూడా ఇదే డెబ్యూ మూవీ కావడం విశేషం. సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తి తనయుడు నమిషి చక్రవర్తి హీరోగా నటిస్తుండగా.. ఫేమస్ ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే.. ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషి కూతురే అమ్రీన్ ఖురేషి.
ఇక బ్యాడ్ బాయ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లో అడుగు పెట్టిన అమ్రీన్.. 'నేను హైదరాబాద్ అమ్మాయినే. నా మొదటి సినిమా షూటింగ్ కోసం ఫస్ట్ టైం హీరోయిన్ గా హైదరాబాద్ కి రావడం అనందంగా ఉంది. నా చేతిలో ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. నా మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి గారు డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక నాతో పాటు నమిషి కూడా హీరోగా డెబ్యూ అవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో సాంగ్ షూట్ చేసాం. త్వరలోనే తెలుగులో సినిమా చేసే అవకాశం ఉంది. మే బి అది 2021 సెకండ్ హాఫ్ లో ఓకే అవచ్చు" అని చెప్పుకొచ్చింది అమ్మడు. ఆలాగే అమ్రీన్ తెలుగులో సూపర్ హిట్ అయిన జులాయి సినిమా బాలీవుడ్ రీమేక్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. మరి ఇలాంటి ఛాన్సెస్ తెలుగు హీరోయిన్స్ కి ఎందుకు రావట్లేదబ్బా.. అంటూ ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఇక మొత్తానికి ఒక హైదరాబాది అమ్మాయి బాలీవుడ్ లో పాగా వేయనుందని వినికిడి.