30 రోజుల్లో రాకుండానే బిజీబిజీ
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించి 'బిగిల్' సినిమాలో కీలక పాత్రలో నటించిన అమృత అయ్యర్ తెలుగులో ప్రదీప్ తో కలిసి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఒక్క పాటతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆ పాటలో కనిపించిన అమృత అయ్యర్ కు తెలుగులో మంచి గుర్తింపు దక్కింది. తప్పకుండా అమృత తెలుగులో ఒక మంచి హీరోయిన్ గా పేరు దక్కించుకోవడం ఖాయం అనిపించింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయిన సమయంలో కరోనా వచ్చి మొత్తం పరిస్థితి తల కిందులు అయ్యింది.
ఏడు నెలలుగా ఆ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఓటీటీ ఆఫర్లు వచ్చినా కూడా థియేటర్లలోనే విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నో చెప్పారు. ఆ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది అనే విషయంలో స్పష్టత లేదు. అయినా కూడా అమృత అయ్యర్ కు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రామ్ తో కలిసి రెడ్ సినిమాలో కూడా నటించిన ఈ అమ్మడు మరో ఇద్దరు యంగ్ స్టార్ హీరోల సినిమాల్లో ఎంపిక అయ్యిందట. అవి కాకుండా మరికొన్ని కూడా చర్చల దశలో ఉన్నాయి.
మొత్తానికి వరుసగా అమృత అయ్యర్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఈ కరోనా లాక్ డౌన్ లేకుండా ఉంటే ఇప్పటి వరకు ఈమె మూడు నాలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.