రోబో-2 విలన్ ఎవరనే విషయంలో దాదాపు ఏడాదిగా సస్పెన్స్ నడిచింది. దాదాపు అరడజను పేర్లు వినిపించాయి. కమల్ హాసన్ - అమీర్ ఖాన్ - విక్రమ్.. ఈ ముగ్గురి చుట్టూ ముందు పుకార్లు నడిచాయి. తర్వాత ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ పేరు వినిపించింది. ఈ హాలీవుడ్ స్టార్ రోబో-2లో విలన్ గా కనిపించడం ఖాయం అనుకుంటుండగా కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ లైన్ లోకి వచ్చాడు. ఐతే చివరికి ఎప్పుడూ చర్చల్లోనే లేని అక్షయ్ కుమార్ విలన్ పాత్రకు ఫిక్సయ్యాడు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకీ శంకర్.. అక్షయ్ నే ఎందుకు ఎంచుకున్నాడు? దానికి ప్రత్యేక కారణం ఏంటి అంటే.. హీరోయిన్ అమీ జాక్సనే అంటున్నారు కోలీవుడ్ జనాలు.
శంకర్ ‘ఐ’ సినిమాలో అమీ జాక్సనే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తన పెర్ఫామెన్స్ కు ముగ్ధుడైపోయి.. రోబో-2లోనూ ఛాన్స్ ఇచ్చాడు శంకర్. ఐతే విలన్ పాత్రకు ఆర్నాల్డ్ ఖాయమనుకున్నాక.. పారితోషకం, ఇతర వ్యవహారాల్లో తేడా వచ్చి చివరి నిమిషంలో అతడికి టాటా చెప్పేయాల్సి వచ్చింది. ఐతే షూటింగ్ మొదలుపెట్టాల్సిన టైం దగ్గరపడుతుండగా.. విలన్ పాత్రకు ఎవర్ని ఫైనలైజ్ చేయాలనే విషయంలో తర్జన భర్జన పడుతుంటే అమీ జాక్సనే అక్షయ్ కుమార్ పేరు సజెస్జ్ చేసిందట. అమీ ఈ ఏడాది అక్షయ్ తో కలిసి ‘యాక్షన్ జాక్సన్’ సినిమాలో చేసిన సంగతి తెలిసిందే. ఐతే అమీ చెప్పాక శంకర్ కు కూడా అక్షయ్ అయితే బాగానే ఉంటుందనిపించి.. అతణ్ని అడగడం.. అంగీకారం కుదరడం.. అంతా చకచకా జరిగిపోయాయి. మామూలుగా పెద్ద హీరోలు అప్ కమింగ్ హీరోయిన్లకు ఛాన్సులిప్పిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ అప్ కమింగ్ హీరోయిన్ వల్ల ఓ స్టార్ హీరోకు ఛాన్స్ వచ్చిందన్నమాట.