చిట్టిక‌న్న‌య్య 2.0 అప్పుడే ఎంత ఎదిగేశాడో!

Update: 2020-10-01 13:30 GMT
గ‌త ఏడాది ఎమీ జాక్సన్ బేబి బంప్ సంద‌డి సోష‌ల్ మీడియాలో అంతా ఇంతా కాదు. నెల‌లు నిండే క్ర‌మంలో నిరంత‌రం ఎమీ త‌న అనుభ‌వాల్ని అనుభూతుల్ని అభిమానుల‌తో పంచుకుంది. ఎట్ట‌కేల‌కు చిట్టిక‌న్న‌య్య 2.0 అరైవ్ అయ్యాక ఇక ఆ ఆనందాన్ని కూడా ఏమాత్రం దాచుకోలేదు. నిరంత‌ర ఫోటోషూట్ల‌తో ఒక‌టే అంత‌ర్జాలాన్ని హీటెక్కించేస్తోంది.

బేబి బోయ్ కి ఆండ్రియాస్ అని నామ‌క‌ర‌ణం చేసింది మొద‌లు త‌న‌తో ఇప్ప‌టికే లెక్క‌కు మిక్కిలి ఫోటోషూట్ల‌లో పాల్గొంది ఎమీజాక్స‌న్. కాబోయే భ‌ర్త జార్జ్ ప‌నాయోటౌ ..మాస్ట‌ర్ ఆండ్రియాస్ తో క‌లిసి ఎమీజాక్స‌న్ దేశ విదేశాల్లో విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అద్భుతమైన ఫోటోల తో తరచూ ట్రెండ్ చేసే ఎమీ జాక్సన్ ఇన్ ‌స్టాగ్రామ్ లో తాజాగా మరికొన్ని చ‌క్క‌ని ఫోటోల్ని జోడించింది. కాబోయే భ‌ర్త‌ జార్జ్ పనాయోటౌ వారి ఏడాది పుత్ర‌ర‌త్నం ఆండ్రియాస్ తో కలిసి లండన్ లో నివసిస్తున్న అమీ జాక్సన్, .. అక్క‌డ వేసవి చివరి కొన్ని రోజులు పూర్తిస్థాయిలో ఆనందిస్తున్నారు. అమీ ఇటీవల తన డే లైఫ్ ని ఇన్ ‌స్టాగ్రామ్ లో పంచుకుంది. ``నా అందమైన బుజ్జి పిల్లాడికి ప్రత్యేక రోజు`` అని వ్యాఖ్య‌ను ఎమీ జోడించింది.

జార్జ్ పనాయోటౌ -ఎమీ జంట గత ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. మే తరువాత ఎంగేజ్ మెంట్ పార్టీని నిర్వహించారు. వారు తమ కుమారుడికి ఆండ్రియాస్ ను సెప్టెంబర్ లో జ‌న్మ‌నిచ్చారు. అప్పుడే ఏడాది కిడ్ బుడిబుడి న‌డ‌క‌ల‌తో సంద‌డి చేసేస్తున్నాడు. ఇక కెరీర్ సంగ‌తి చూస్తే.. ఎమీ చివరిసారిగా రజనీకాంత్ రోబోట్ డ్రామా 2.0 లో కనిపించింది. ఇందులో అక్షయ్ కుమార్ కూడా నటించారు. ఇప్ప‌టికే లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎమీ జాక్స‌న్ ఇక‌నైనా తిరిగి ముఖానికి రంగేసుకుని ఇండియన్ సినిమాల్లో న‌టిస్తుందా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News