పర్ఫెక్ట్ బ్యాక్ అందాలు ఇలా ఉంటాయ్

Update: 2017-03-29 10:46 GMT
ముంబై భామ అమైరా దస్తూర్ ఇప్పటికే దక్షిణాది జనాలకు పరిచయం ఉంది. ధనుష్ నటించిన అనేకుడు డబ్బింగ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిచింది ఈ బ్యూటీ. ఆ తర్వాత జాకీ చాన్ సినిమా కుంగ్ ఫు యోగాలో ఆఫర్ పట్టుకుని ఆశ్చర్యపరచిన అమైరా.. ఇప్పుడు కూడా చేతి నిండా సినిమాలతో స్పీడ్ చూపిస్తోంది.

ఫోటో షూట్స్ చేయడం సంగతేమో కానీ.. వాటితో తమ స్ట్రెంగ్త్ ను చాటడం మాత్రం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. తాజాగా అమైరా ఇచ్చిన ఓ పోజ్.. ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. బ్లూ కలర్ పటియాలా డ్రెసింగ్ లో.. అందాలను వెనక నుంచి చూపిస్తూ షాక్ ఇచ్చేసింది. పర్ఫెక్ట్ బాడీ మెయింటెయిన్ చేయడం అంటే.. ఏ యాంగిల్ నుంచి అయినా మెప్పించేయగలగడం అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది అమైరా దస్తూర్. ఈ రేంజ్ లో బ్యాక్ అందాలను మెయింటెయిన్ చేయడం చూస్తే.. అమైరా ఫిట్నెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతుంది. ఈ లుక్కులో అమ్మడు గత రాత్రి జరిగిన ఐఫా ఉత్సవం అవార్డుల కార్యక్రమంలో డ్యాన్సులు వేసిందిలే.

ప్రస్తుతం తమిళ్ లో కమెడియన్ సంతానం హీరోగా తెరకెక్కుతున్న ఊడి ఊడి ఉఝైకనుం చిత్రంలో నటిస్తున్న అమైరా దస్తూర్.. డైరెక్ట్ తెలుగు సినిమాకి కూడా మొదటిసారిగా సైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' మూవీలో అమైరానే హీరోయిన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News