ఫ్యాక్ట్‌ చెక్‌ : అవకాశాలు లేక డ్రైవర్‌ గా మారిన హీరో

Update: 2023-06-10 21:00 GMT
సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంత కాలం క్రితం హీరోలు గా ఎంట్రీ ఇచ్చిన వారు రెండు మూడు సినిమా లతో సందడి చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత వారు ఏదో ఒక పని చేస్తూ సోషల్‌ మీడియా లో ప్రత్యక్షం అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.

ఇప్పుడు తమిళం లో ధనుష్ తో కలిసి నటించిన ఒక నటుడు బతుకు తెరువు కోసం డ్రైవర్‌ గా మారాడు... కుటుంబ పోషణ కష్టం అవ్వడం తో తప్పని పరిస్థితుల్లో డ్రైవర్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం మొదలు అయ్యింది. ఆ ప్రచారం వైరల్ అవ్వడంతో చివర కు ఆ నటుడు స్పందించి.. అయ్యో అదేం లేదు.. నేను బాగానే ఉన్నాను.. నా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది అంటూ ప్రకటించాల్సి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా కాదల్ కొండేన్‌. ఆ సినిమా లో ధనుష్‌.. సోనియా అగర్వాల్‌.. సుదీప్ సారంగి లు నటించారు. ఈ ముగ్గురికి కూడా ఆ సినిమా తో తొలిపరిచయం అయ్యింది. ముగ్గురు కూడా మొదటి సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

ధనుష్ స్టార్‌ హీరో గా వరుస సినిమాలు చేస్తూ ఉండ గా సోనియా అగర్వాల్‌ కొంత కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగింది. ఇక సుదీప్ సారం గి కూడా కొన్ని సినిమాలు చేశాడు. హీరో గా మాత్రం అతడికి బ్రేక్ రాలేదు. ఈ మధ్య కాలం లో అతడు కనిపించలేదు.

ఇన్నాళ్ల తర్వాత డ్రైవర్ యూనిఫామ్ లో సుదీప్ సారంగి కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. దాంతో అంతా కూడా అయ్యో పాపం సుదీప్ సారంగి కి ఎంత కష్టం వచ్చింది.. ఇలాంటి సమయం లో ధనుష్‌ అతడి ని ఆదుకోవాలి కదా అంటూ సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున హడావుడి సాగింది.

కానీ అసలు విషయం ఏంటి అంటే సుదీప్ ఒక ప్రకటన కోసం అలా డ్రైవర్‌ డ్రెస్ లో కనిపించాడు. తన ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా అయితే లేదని... కుటుంబ పోషణ భారంగా అసలే లేదు అన్నట్లుగా పేర్కొన్నాడు. సోషల్ మీడియా లో తన గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని అతడు విజ్ఞప్తి చేశాడు.

Similar News