ఫోటో స్టొరీ: బ్యూటీకి డెఫినిషన్ ఈ బేబీ!

Update: 2019-06-27 08:26 GMT
సౌత్ లో చాలామంది హీరోయిన్లే ఉన్నారు కానీ సమంతా రూటే సెపరేటు.  ఏ పాత్ర పోషించినా అందులోని లీనమైపోవడం సామ్ ప్రత్యేకత.  'రంగస్థలం' రామలక్ష్మి పాత్రలో ఎంత  నాటుగా ఉంటుందో 'U టర్న్' రచన పాత్రలో అంత మోడరన్ గర్ల్ లాగా ఉంటుంది.  ఇక 'సూపర్ డీలక్స్' లో వెంబు పాత్రలోఅక్రమ సంబంధం పెట్టుకునే మహిళగా మనల్ని షాక్ కు గురిచేస్తుంది.  అదే సమయంలో 'మజిలీ' లో పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టుగా ప్రవర్తించే టిపికల్ ఇండియన్ హౌస్ వైఫ్ శ్రావణి పాత్రలో ఒదిగిపోయింది.  అద్బుతమైన నటి అయితే తప్ప ఇలా పూర్తిగా వ్యతిరేకమైన పాత్రలను పోషించి మనల్ని మెప్పించడం అసాధ్యం.  ఇదంతా ప్రొఫెషన్.. ఇక రియల్ లైఫ్ లో సామ్ యమా ఫాస్ట్.  అగ్గిపుల్ల లేకుండానే సోషల్ మీడియాలో మంటలు పెట్టేస్తుంది.

తాజాగా మరోసారి సామ్ ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. ప్రముఖ డిజైనర్ క్రేశ బజాజ్ డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసింది. ఈ బ్లాక్ కలర్ డ్రెస్ కు ఒక సైడ్ అంతా మూడు అంగుళాల స్ట్రెచ్ అలానే పారదర్శకంగా వదిలేయడంతో హాటెస్ట్ డ్రెస్ గా మారిపోయింది.  సమంతా మేకప్.. హెయిర్ స్టైలింగ్ పర్ఫెక్ట్ గా ఉండడంతో సామ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.  డ్రెస్ చాలా హాట్ గా ఉన్నపటికీ ఒక అందమైన పోజులో గ్రేస్ ఫుల్ గా కూర్చొని ఆ డ్రెస్ కే కొత్త అందాన్ని తీసుకొచ్చింది.  ఇలాంటి హాట్ డ్రెస్ వేసుకునప్పుడు చాలామందికి గ్రేస్ మిస్ అవుతుంది కానీ సామ్ మాత్రం తన గ్రేస్ తో.. సెన్సువల్ లుక్ తో తాట తీసేసింది.

అందుకే ఈ ఫోటోను సామ్ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన రెండు గంటల్లోపే మూడు లక్షల లైకులు వచ్చాయి. ఇక కామెంట్లు సరే సరి. "బ్యూటీ డెఫినిషన్ నువ్వే".. "నాగిన్ స్టైల్ డ్రెస్ లా ఉందే".. "ముత్యం లా మెరుస్తున్నావు"... "ఓ బేబీ టూ సెక్సీ" అంటూ కామెంట్లు వచ్చాయి. ఒకరు మాత్రం ఈ డ్రెస్ సెలెనా గోమెజ్ వేసుకున్న డ్రస్ లా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమాల విషయానికి వస్తే త్వరలో సామ్ కొత్త సినిమా 'ఓ బేబీ' రిలీజ్ కానుంది.  ఈ సినిమాతో పాటుగా '96' తెలుగు రీమేక్ లో నటిస్తోంది.  'మన్మథుడు 2' లో ఒక క్యామియో చేస్తోంది.
Tags:    

Similar News