`పెళ్లి చూపులు `ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన `ఈ నగరానికి ఏమైంది` చిత్రం మంచి సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. తనపై నిర్మాత సురేష్ బాబు పెట్టుకున్న నమ్మకాన్ని తరుణ్ భాస్కర్ నిలబెట్టుకున్నాడు. ఆ చిత్రంలో హీరో విశ్వక్ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆ చిత్రం సక్సెస్ అయిన సందర్భంగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వక్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన మొదటి సినిమా నిర్మాతతో గొడవైందని.....ఆ సినిమా తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్నానని చెప్పాడు. సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేస్తే......నువ్వెవడ్రా ..నాకు చెప్పడానికి అని అన్నాడని...దాంతో కోపం వచ్చి ఆ నిర్మాతపై ఫైర్ అయ్యానని విశ్వక్ చెప్పాడు. దీంతో, ఆ సినిమాలో తనతో డబ్బింగ్ కూడా చెప్పించుకోలేదని, హీరో అయిన తాను లేకుండానే ట్రైలర్ రిలీజ్ చేసుకున్నాడని చెప్పాడు.
ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చిందని, ఆ తర్వాత `వెళ్లిపోమాకే` సినిమాలో అవకాశం వచ్చానని అన్నాడు. ఆ గ్యాప్ లో షార్ట్ ఫిలిమ్స్ తీశానని అన్నాడు. తానే హీరోగా నటిస్తూ...దర్శకత్వం కూడా చేశానని ...తన క్యారెక్టర్ కు పెద్దగా డైలాగులు కూడా ఉండవని అన్నాడు. మురారి చూసి యాక్టర్ అవుదామని అనిపించిందని, తాను యాక్టర్ ని మాత్రమేనని...హీరో కాదని అన్నాడు. అంతఃపురంలో జగపతి బాబుగారి పాత్ర చాలా ఇష్టమని, మంచి క్యారెక్టర్ ఉంటే సినిమాలో అరగంట కనిపించినా చేస్తానని చెప్పాడు. సినిమా విడుదలైన ఫస్ట్ వీక్ థియేటర్లో కర్చీఫ్ కట్టుకొని సినిమా చూశానని....బయటకు వచ్చాక...ఫ్యామిలీ లేడీస్...ఆంటీస్ - అంకుల్స్...సినిమా బాగుందన్నారని చెప్పాడు. అందుకే...యూత్ కు ఫస్ట్ వీక్ టిక్కెట్లు దొరక లేదని చెప్పాడు. ఈ సినిమాతో యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని....రెండు మూడు సార్లు చూశామని చెబుతున్నారని అన్నాడు.