ర‌ఫ్‌ గా క‌నిపిస్తారు కానీ..మాట వింటారు

Update: 2018-09-15 11:40 GMT
ఎన్టీఆర్ అభిమానుల అంచ‌నాల్ని అందుకునే మొద‌టి సింగిల్ రిలీజైంది. అర‌వింద స‌మేత నుంచి అన‌గ‌న‌గ‌న‌గ అంటూ సాగే పాట‌ను లాంచ్ చేసింది చిత్ర బృందం. పాట‌లో పెప్ ఆక‌ట్టుకుంది. త‌మ‌న్ బాణీ మెరుపులు మెరిపించింది. స్పైస్ - రొమాన్స్ ని త‌మ‌న్ బాణీలో ఆవిష్క‌రించిన తీరు మెచ్చుకుని తీరాలి.

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో  హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ నిర్మిస్తున్న సినిమా అర‌వింద స‌మేత‌ చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్త‌వుతోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో కీల‌క స‌న్నివేశాల చిత్ర‌ణ సాగుతోంది. సెప్టెంబ‌ర్ చివ‌రి వారం నాటికి టాకీ పూర్తిచేసి - పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీపూర్తి చేస్తారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న సినిమా విడుద‌ల చేయ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 20న అర‌వింద స‌మేత ఆడియో విడుదల కానుంది. అయితే ఈ ఈవెంట్‌ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉందింకా.

తాజాగా  ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సింగిల్ జోరుగా వైర‌ల్ అవుతోంది. అన‌గ‌న‌గ‌న‌గ అర‌వింద‌ట త‌న‌మేరు... అంటూ సాగే పాట తార‌క్ ఫ్యాన్స్‌ లో దూసుకెళుతోంది. ర‌ఫ్‌ గా క‌నిపిస్తారు కానీ..! మాట వింటారు.. ఫ‌ర్లేదు!! అంటూ క‌థానాయిక పూజా హెగ్డే డైలాగ్‌ తో ఈ పాట ప్రారంభం ఆక‌ట్టుకుంది. త‌మ‌న్ మ‌రోసారి ఎన్టీఆర్‌కి అద్భుత‌మైన బాణీలు అందించార‌ని ఈ పాట చెబుతోంది. త‌మ‌న్ ఇదివ‌ర‌కూ  బృందావ‌నం - రామ‌య్యా వ‌స్తావ‌య్యా - ర‌భ‌స చిత్రాల‌కు సంగీతం అందించారు. ఈ కాంబినేష‌న్‌ లో నాలుగో చిత్ర‌మిది.


వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    

Similar News