365 డేస్ చూసిన వాళ్లంతా చెబుతున్న మాట.. హీరోయిన్ అనైక సూపర్. తన అభినయంతో, అందంతో అదరగొట్టేసిందీ ముంబయి భామ. ఐతే తొలి సినిమా 'సత్య-2'లో సన్నని మల్లెతీగలా ఉన్న అనైక '365 డేస్' దగ్గరికి వచ్చేసరికి షేపులు మారిపోయింది. అందులోనూ కొన్ని రోజుల కిందైతే మరీ లావుగా, చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండేది అనైక. ఈ మధ్యే కొంచెం ఒళ్లు తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. హీరోయిన్‌గా ఉంటూ ఫిజిక్ పట్ల అంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటి అని అనైకను అడిగిగే.. ''నాకు స్వీట్స్ అంటే పిచ్చి. అవి ముందుంటే అస్సలు నోరు కట్టుకోలేను. నేను హీరోయిన్ అన్న సంగతి కూడా మరిచిపోయి చాక్లెట్లు, స్వీట్స్ విపరీతంగా తినేశా. దీంతో చాలా లావైపోయా. కానీ నా అవతారం నాకే ఇబ్బందిగా అనిపించి.. ఇప్పుడు బరువు తగ్గుతున్నా'' అని చెప్పింది అనైక.
తానో ఆశ్రమంలో చదువుకున్నానని.. చిన్నప్పుడు ఎప్పుడూ భక్తి సినిమాలే చూసేదాన్నని.. ఉన్నత చదువుల కోసం మలేషియాకు వెళ్లినప్పటి నుంచి మాత్రమే కమర్షియల్ సినిమాలు చూడటం మొదలైందని.. అపరిచితుడు తాను చూసి తొలి కమర్షియల్ సినిమా అని చెప్పింది అనైక. ఓసారి ముంబయిలో ఎలివేటర్ మీద వెళ్తుండగా వర్మ తనను అనుకోకుండా చూసి.. వెంటనే సినిమా ఆఫర్ చేశాడని.. అలా తాను ఊహించని విధంగా హీరోయిన్ అయ్యానని.. వర్మ దర్శకత్వంలో అంటే అది ఎలాంటి సినిమా, తన పాత్ర ఎలా ఉంటుంది అని చూడకుండా కళ్లు మూసుకుని నటించేస్తానని చెప్పింది అనైక. తాను పార్టీలకు వెళ్లనని.. ఎవరితో సోషలైజ్ కానని.. అందుకే ఎక్కువ సినిమాల్లో నటించలేకపోతున్నానని అనైక తెలిపింది.