సినిమాటోగ్రఫర్ గా కేవీ గుహన్ కి మంచి పేరు ఉంది. ఈ మధ్య ఆయన దర్శకుడిగా మారిపోయి, సస్పెన్స్ నేపథ్యంలో సాగిపోయే కథలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అలా తెరపైకి వచ్చిన '118' మంచి విజయాన్ని సాధించింది. కథాకథనాల పరంగా .. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు .. ఆ సినిమా పేరే 'హైవే. ఆనంద్ దేవరకొండ - మానస రాధాకృష్ణన్ జంటగా ఈ సినిమా నిర్మితమైంది.
ఇది సైకో క్రైమ్ థ్రిల్లర్ కథ .. ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథ. ఈ నాలుగు పాత్రలనే ప్రధానంగా చేసుకుని కథ అంతా కూడా వాళ్ల చుట్టూనే తిరుగుతుంది.
వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా, షూటింగు పార్టును పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ, ముందుగా నాలుగు పాత్రలకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్లు వదిలారు. ఈ పోస్టర్లు చాలా ఇంట్రెస్టింగా ఉన్నాయి. సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి .. ఆతృతను పెంచుతున్నాయి.
ఆనంద్ దేవర కొండ విషయానికి వస్తే, 'దొరసాని' సినిమాతో పరిచయమైన ఆయన, 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన 'పుష్పక విమానం'తో మరో మెట్టు ఎక్కాడు. ఆ తరువాత సినిమాగా ఆయన చేసిన సినిమానే 'హైవే'. గతంలో హైవే నేపథ్యంలో కొన్ని క్రైమ్ థ్రిల్లర్లు వచ్చాయి.
కాకపోతే ఈ సినిమా తీరు వేరు .. దీని దారివేరు. ఎందుకంటే ఇక్కడ సినిమాటోగ్రఫర్ దర్శకుడు కావడం వలన, చిత్రీకరణ ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ తరహా కథలకు కెమెరా పనితనమే ప్రధానం. అందువలన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందనే నమ్మకంతో వెళ్లొచ్చు.
మానస రాధాకృష్ణన్ ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోయింది. ఈ మలయాళ మందారానికి కెమెరా కొత్తకాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది.
ఆ తరువాత హీరోయిన్ గా అక్కడ సినిమాలు చేస్తూనే, ఇటు కూడా ఓ అడుగు వేసిందంతే. ఇక బాలీవుడ్ హాట్ స్టార్ సయామీ ఖేర్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. వెబ్ సిరీస్ ల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న అభిషేక్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.