సినిమా ప్రపంచంలో ఏ పని చేసినా బినేనెస్ లో భాగమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఫ్యాషన్ ప్రపంచంలో ఆ డోస్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ మంచి గుర్తింపు రావాలని కొందరు కొన్ని మంచి పనులను చేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే..ఈ మధ్య మ్యాగజైన్ ల గోల చాలా ఎక్కువైందనే చెప్పాలి. ఫ్యాషన్ - సినిమా ప్రపంచాలను కలిపేసే మ్యాగజైన్ ల వాల్యూ చాలా వరకు పెరిగిపోతోంది.
హీరోయిన్స్ కూడా ఆ రూట్ లో అడుగులు వేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. అందుకోసం ఎప్పుడు లేని విధంగా చాలా హాట్ గా కూడా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. అయితే గత కొంతకాలంగా మార్కెట్ లో ఓ లెవెల్లో నడుస్తోన్న వెర్వ్ అనే లైఫ్ స్టైల్ మ్యాగజైన్ సృష్టి కర్త ఎవరో తెలిసిన తరువాత అందరూ ఆశ్చర్య పోయారు. అదితి రావ్ హైదరి అందం ఆ విషయాన్ని బయట పెట్టింది. ఆ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ ఛీప్ గా ఉన్నది అనురాధ మహీంద్రా. ఈమె మరెవరో కాదు. నిత్యం బిజినెస్ అంటూ కరెన్సీ తో కాలాన్ని గడిపే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మహీంద్ర గ్రూప్ ఛైర్మన్... ఆనంద్ మహీంద్ర.
రీసెంట్ వెర్వ్ కవర్ పేజ్ పై అదితి సింపుల్ గా ఉన్న ఫొటోను చూసిన ఆయన అందానికి ఫిదా అయ్యి.. ఆమెను పొగుడుతూ మ్యాగజైన్ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. అదితి ఆ ఫొటో షూట్ లో ఎలాంటి మేకప్ లేకుండా స్టిల్స్ ఇచ్చిందట. ఇటీవల అమ్మడు పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ భార్యగా కనిపించి నటనతో అందరిని ఆకట్టుకుంది.