వ‌ద్దు `బంగారం` అంటే చేతులు ప‌ట్టుకుని మొక్కాడు!

Update: 2021-05-12 00:30 GMT
కొన్నిసార్లు ప‌రిశ్ర‌మ‌లో స్నేహాలను కాద‌న‌లేని ప‌రిస్థితి ఉంటుంది. క‌థ కంటెంట్ న‌చ్చ‌క‌పోయినా రాజీకి వ‌చ్చి సినిమాని అంగీక‌రిస్తే ఎలా ఉంటుందో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రుచి చూసార‌ట‌. ఇంత‌కుముందు అత‌డు ధ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో బంగారం చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చేయ‌ను మొర్రో అని ప‌వ‌న్ వారించినా కానీ ధ‌ర‌ణి వ‌దిలి పెట్ట‌లేదు. పైగా త‌మిళంలో హిట్టందుకుని ఇక్క‌డ ప‌వ‌న్ ని ఓ ప‌ట్టు బ‌ట్ట‌డంతో ఆయ‌న మొహ‌మాటానికి బంగారం సినిమా చేశాడు. ఆ త‌ర్వాత రిజ‌ల్ట్ తెలిసిందే.

ఇదే విష‌యాన్ని పవ‌న్ క‌ల్యాణ్ స్నేహితుడు .. క‌ళాద‌ర్శ‌కుడు ఆనంద్ సాయి ఓ చిట్ చాట్ లో వెల్ల‌డించారు. కథ విన్నప్పుడు లేదా షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా? అనేది మేం చర్చిస్తుంటాం. కథ ఎంపిక‌లో గొప్ప తీర్పు ఉన్న పవన్ కళ్యాణ్ గెస్ ఎలా నిజ‌మైందో వెల్ల‌డించారు.

పవన్ కళ్యాణ్ `బంగారం` కథ గురించి విని సెకండాఫ్ లో ర‌క‌ర‌కాల‌ సందేహాలను లేవనెత్తాడు. త‌ర్వాత‌ నిర్మాత ఎ.ఎమ్.రత్నంతో మాట్లాడుతూ ఈ చిత్రం చేయడానికి తాను ఆసక్తిగా లేన‌ని తెలిపారు. కానీ దర్శకుడు ధరణి తమిళ చిత్రంతో విజయం సాధించి పవన్ ను కలిశాడు. ``పవన్ కళ్యాణ్ చేతులను పట్టుకుని ఇవే కాళ్లుగా పరిగణించమని ధ‌ర‌ణి అన్నాడు. చాలా హిట్స్ ఇచ్చిన తరువాత తనను నమ్మమని కోరాడు. పవన్ ఒక్క మాట కూడా చెప్పలేదు``  అని ఆనంద్ సాయి చెప్పారు. కానీ అంతిమంగా ప‌వ‌న్ ఊహించిందే జ‌రిగింది. బంగారం బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. ఇక ఖుషీ-త‌మ్ముడు చిత్రాల‌కు ప‌వ‌న్ ఇచ్చిన ఇన్ పుట్స్ పెద్ద రేంజులో వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని కూడా ఆనంద్ సాయి వెల్లడించారు.
Tags:    

Similar News