పవన్ కళ్యాణ్ కు ఆప్త మిత్రులు కొద్ది మంది ఉంటారు. వారిలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒకరు అనడంలో సందేహం లేదు. ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఆనంద్ సాయి గత కొన్నాళ్లుగా యాదాద్రి దేవాలయం పునః నిర్మాణ పనుల్లో ఉండటం వల్ల సినిమా కు వర్క్ చేయలేక పోయాడు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సినిమా తో ఆనంద్ సాయి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ తర్వాత రాబోతున్న సినిమా కోసం ఆనంద్ సాయి భారీ సెట్టింగ్ లను నిర్మిస్తున్నాడట. తాజాగా ఆనంద్ సాయి మాట్లాడుతూ పవన్ 28 సినిమా కోసం వేసిన సెట్టింగ్ ల గురించి స్పందించాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో ఒకటి లెక్చరర్ పాత్ర కాగా రెండవది పోలీసు పాత్ర. పవన్ కళ్యాణ్ పోలీసు పాత్రలో ఇప్పటికే గబ్బర్ సింగ్ చిత్రంలో నటించి మెప్పించాడు. కనుక పోలీసు పాత్ర నిజమే కాని లెక్చరర్ పాత్ర పై కొందరికి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకు చెక్ పెట్టేల ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఒక కాలేజ్ సెట్టింగ్ ను నిర్మించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ సెట్టింగ్ నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా బాగా నచ్చిందట. చాలా అద్బుతంగా ఉందంటూ కితాబిచ్చారట.
కాలేజ్ సెట్టింగ్ వేశారు కనుక ఖచ్చితంగా సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చినట్లయ్యింది. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం ఉన్న ఆనంద్ సాయి తన అభిమానంను సెట్ రూపంలో చూపించినట్లుగా ఉన్నాడు. అందుకే సెట్టింగ్ అద్బుతంగా వచ్చిందటూ మేకర్స్ కూడా అంటున్నారట. వచ్చే నెలలో సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆనంద్ సాయి వేసిన కాలేజ్ సెట్టింగ్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. మెసేజ్ ఇవ్వడంతో పాటు ఒక పక్కా కమర్షియల్ మూవీగా ఈ సినిమా ఉంటుందని హరీష్ శంకర్ చెబుతున్నాడు.