చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనందర్ జీవితచరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలో షూటింగ్ మొదలు పెడతామని చిత్ర నిర్మాత మహావీర్ జైన్ చెప్పారు. అయితే ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఒక్క బాలీవుడ్లోకాక.. ప్రాంతీయ భాషల్లో సైతం బయోపిక్‌లు తెరకెక్కించేందుకు నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉంటే దిగ్గజ చెస్ ప్లేయర్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత విశ్వనాథన్ ఆనంద్ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తీయబోతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో విశ్వనాథన్ ఆనంద్ పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే చిత్ర నిర్మాత మహావీర్ జైన్ మాట్లాడుతూ.. టైటిల్ రోల్‌కు అమీర్‌ఖాన్ అయితే సెట్ అవుతాడని తన అభిప్రాయమని చెప్పారు. ఇప్పుడీ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ప్రస్తుతం ఈ చిత్రం స్టోరీపై వర్క్ చేస్తన్నాం. స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాం. నటీనటులు ఎవరన్న విషయం ఇంకా నిర్ణయించలేదు. అయితే అమీర్‌ఖాన్ బాగుంటాడన్నది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయంపై ఇంకా చర్చలు జరగలేదు’ అని ఆయన చెప్పారు.
మరోవైపు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులయ్యారు. అమీర్‌ఖాన్ గతంలో ‘దంగల్’ సినిమాలోని మహావీర్ సింగ్ ఫొగాట్గా నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.