ఇదేం పోలిక సామీ అంటారా? అక్కడికే వస్తున్నాం. ఈ పోలికను చూసినప్పుడు సంబంధం ఉన్నవి కొన్ని.. సంబంధం లేనికి మరికొన్ని అన్నట్లుగా ఉంది కదా? అసలు విషయం వేరే ఉంది. రాముడు -సీత ఓకే. కాకి - గరిక ఏంటి? చిరంజీవి - అనంత శ్రీరాం ఏమిటి? ఈ మధ్యలో హనుమంతుడు ఎందుకు వచ్చినట్లు? అన్న కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఎందుకంటే అసలు విషయం వేరే ఉంది. దసరా కానుకగా తెలుగు ప్రజలతో పాటు పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిరు గాడ్ ఫాదర్ ఇప్పుడు సైలెంట్ గా దూసుకెళుతోంది.
ఈ మూవీకి సంబంధించి కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. అంతేకాదు.. ఈ మూవీ హిందీ బెల్ట్ లో శనివారం నాటికి 600థియేటర్లను యాడ్ చేయటంతో ఈ మూవీ వసూళ్లు మరింత పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి గొప్పతనాన్ని ఎవరికి వారు కీర్తిస్తున్న వేళ.. గీత రచయిత అనంత శ్రీరాం రామాయణంలోని ఒక అంశాన్ని ప్రస్తావించారు.
నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. చిరంజీవిని ఎవరు పడితే వారు ఏదో ఒకటి అంటారని.. ఆయన మాత్రం ఓపిగ్గా ఎవరిని ఏమీ అనకుండా ఉంటారని.. ఆయనకున్న సహనాన్ని చెబుతూ.. తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన మాటల్ని విన్న నేపథ్యంలో వేదిక మీద ఉన్న గీత రచయిత అనంత శ్రీరాం మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు గొప్పతనాన్ని చెప్పేందుకు రామాయణంలోని ఒక అంశాన్ని ప్రస్తావించారు.
సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించటం.. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన హనుమంతుడు.. సీతాదేవిని చూడటం తెలిసిందే. ఆమెను కలిసి తాను ఎవరన్న విషయాన్ని చెప్పిన హనుమంతుడు.. రాముడికి ఆమె సందేశాన్ని ఏమైనా ఇస్తారా? అనగటం తెలిసిందే. ఇదే విషయాన్ని చెప్పిన అనంత శ్రీరాం.. 'చూడామణి.. నగలు.. వీటి వల్ల సీతను కలిశానన్న ఆనవాలు చూపించొచ్చు. కానీ.. నిజంగానే నేను సీతనే చూశానని రాముడికి చెప్పి నమ్మించాలంటే వారిద్దరికే తెలిసిన ఒక సన్నివేశాన్ని నాకు చెప్పాలని కోరాడు హనుమంతుడు. దానికి సీత.. ఒక రోజు రాముడు నా ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి నా గుండెల మీద పొడుస్తుంటే రాముడి నిద్ర చెడకూడదని అలాగే భరిస్తూ వచ్చా. కానీ రక్తపు చుక్క తగిలి రాముడు నిద్ర లేచి చూస్తుండేసరికి కాకి మళ్లీ పొడవటానికి వస్తుంది. అంత శాంతమూర్తి కూడా కోపంతో ఒక గరికను లాగి ఆ కాకి మీద బ్రహ్మాస్త్రంగా వేశాడని హనుమంతుడికి చెబుతుంది. ఇక్కడ నేను చెప్పేదేమంటే.. నేను బ్రహ్మాస్త్రం అయ్యానని గరిక గర్వపడేకంటే.. ఒక వ్యక్తి మంత్రించటం వల్లే నేను బ్రహ్మాస్త్రాన్ని అయ్యానని గరిక వినయంగా ఒప్పుకుంటే దాని విలువ పెరుగుతుంది. రాముడి విలువ మాత్రం ప్రత్యేకంగా పెరగదు.. తగ్గదు. ఎందుకంటే రాముడి విలువ ఎప్పుడూ అలానే ఉంటుంది' అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అర్థమైందా రాముడు సీత.. కాకి గరిక.. చిరంజీవి అనంత శ్రీరాం ఎలానో?