పొట్టి పొట్టి డ్రస్సుల్లో పిచ్చెక్కిస్తున్న పూరీ హీరోయిన్

Update: 2020-03-24 09:30 GMT
బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంకీ పాండే వారసురాలిగా 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2' సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ అనన్య పాండే. అందంతో పాటు అభినయం కూడా ఈమె సొంతం. 'పతీ పత్నీ ఔర్ ఓహ్', 'అంగ్రేజీ మీడియం' చిత్రాలతో మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బాలీవుడ్ భామ ప్రస్తుతం విజయ దేవరకొండ నటిస్తున్న మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఫైటర్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని కరణ్ జోహార్ భాగస్వామ్యంలో నటి చార్మ్ కౌర్ నిర్మిస్తున్నారు. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం తోపాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు వీలైనప్పుడల్లా తన హాట్ హాట్ పోటోలను పోస్టు చేస్తూ కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది.

ఇప్పుడు తాజాగా పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాల్లో వైరల్ అయింది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా సామాన్యుల నుండి సెలెబ్రెటీల దాకా అందరూ స్వీయ నిర్బంధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే కూడా గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. అయితే ఈ అమ్మడుకు ఇంట్లోనే ఉంటూ బోర్ కొట్టిందేమో..స్కిన్ షో చేస్తూ ఒక ఫోటో అప్లోడ్ చేసింది. సెల్ఫీ తీసుకునే భంగిమలో బ్లాక్ ఆఫ్-షోల్డర్ స్కింపీ దుస్తుల్లో హాట్ గా కనిపిస్తున్న ఈ బాలీవుడ్ భామ కుర్రకారు హృదయాల్లో గుబులు రేపింది. ఇంకేముంది ఫోటో మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంత బాగా రెడీ అయినా ఏమి లాభం బయటకి వెళ్లే పరిస్థితి లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News