చక్కనైన చీరకట్టులోనూ సెక్సీ లుక్స్!!

Update: 2016-12-23 05:50 GMT
హాట్ యాంకర్ అనసూయ సినిమాల్లో కూడా ఇరగదీసేస్తోంది. యాంకర్ గా ఉన్నపుడే తన హాట్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ని మత్తెక్కించిన ఈ బ్యూటీ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక స్టైలింగ్ నే కాదు.. ఓవరాల్ గా తన లుక్ మొత్తాన్ని మార్చేసింది. రీసెంట్ గా ఓ ఛానల్ అవార్డ్ ఫంక్షన్ జరిగితే.. అక్కడ అమ్మడు శారీలో ఇచ్చిన లుక్ మామూలుగా లేదు.

పింక్ కలర్ శారీ కట్టిన అనసూయ.. సీ గ్రీన్ స్లీవ్ లెస్ జాకెట్ లో సందడి చేసింది. ఫ్రంట్ లుక్ లో అచ్చమైన తెలుగింటి అందగత్తె లుక్ ఇచ్చిన అనసూయ.. బ్యాక్ నుంచి మాత్రం బ్యాక్ లెస్ జాకెట్ లోంచి వీపంతా ఆరబోసేసింది. జాకెట్ కి కట్టిన డోరీస్ అమ్మడి అందానికి.. వేసిన డ్రస్సుకు మరిన్ని హంగులు అద్దాయి. ఈ మధ్య టీవీల కంటే సినిమాలపైనే ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తున్న ఈ భామ.. బుల్లితెర తారల మధ్యలో నుంచున్న వెండితెర బ్యూటీగా ఎట్రాక్ట్ చేసేసింది.

అటు టీవీషోలతో పాటు.. రీసెంట్ గా సాయి ధరం తేజ్ మూవీ విన్నర్ లో ఓ ఐటెం సాంగ్(అనసూయ భాషలో దాన్ని స్పెషల్ సాంగ్ అనాలి) చేసింది. ఇలా స్పెషల్ సాంగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక అనసూయా భరద్వాజ్ కు అవకాశాలు అనేకానేకం వచ్చేస్తున్నాయట. మరి అందాన్ని అవకాశాలను ఎలా బ్యాలెన్స్ చేస్తుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News